అణువు మొదలు ప్రతి ఒక్కటీ పరిభ్రమిస్తూనే ఉంది. రూపాంతరం చెందుతూనే ఉంది. అత్యేతి రజనీయాతు - రాత్రి పోయి పగలు పగలు పోయి రాత్రి వస్తున్నాయంటే పోయిన రాత్రి రావటం లేదు. పోయిన పగలు రావటం లేదు. సాన ప్రతినివర్తతే. అది కాదు. మరలా వస్తున్నది. మరేమిటి. ఆ రాత్రిలాంటి మరొక రాత్రి. ఆ పగలు లాంటి మరొక పగలు. ఎప్పటికప్పుడు భవిష్యత్తు వర్తమాన మవుతూ వర్తమానం మరలా భూతంగా మారిపోతున్నది. ఎప్పటికప్పుడు నిత్యనూతన మీ సంసారం. అందుకే సంసారమని పేరు వచ్చిందసలు. సంసరతి అవిచ్ఛేదేన ప్రవర్తతే ఇతి సంసారః - ఎప్పుడూ ఎడతెగక ధారావాహికంగా ప్రసరిస్తూ పోయేదని అర్థం.
ఇలా ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా Ever fresh కనిపించక పోతే ప్రతి ఒక్కటీ అలాగే నిలబడి పోవాలి. భూత భవిష్యత్తులు రెండూ వర్తమానంలో కలిసిపోయి వర్తమానమే ఎప్పుడూ మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి. అప్పుడిక జనన మరణలే లేకుండా పోవలసి వస్తుంది. అవి లేకుంటే మన తాతలూ తండ్రులూ ఎవరేగాని మరణించకుండా మనతోపాటు ఇప్పుడు కూడా బ్రతుకుతూ ఉండాలి. మనమూ ఎప్పుడూ చావకుండా బ్రతికే ఉండాలి. ఇది లోకానుభవానికే సరిపడని వ్యవహారం. అంచేత యాత్యేవ యమునా పూర్ణా సముద్రముద కాకులమ్ ఒక యమున లాంటి నది ఎప్పుడూ ఎలా ప్రవహిస్తూనే పోతుందో - పోయి చివరకు
Page 26