మరి ఈ జరామరణాలను తప్పించుకొనే మార్గమే లేదా. ఉంది. అది నరా వశంగతా అనే మాటలలో మహర్షి సూచిస్తూనే ఉన్నాడు. నరుడే దాని వీడు నారాయణుడు కాలేక పోతున్నాడు. కొత్తగా కానక్కరలేదు కూడా. అయ్యే ఉన్నాడిప్పుడూ. నిరాకారమూ వ్యాపకమూ అయిన చైతన్యమిప్పుడూ ఉంది ఈ శరీరంలో. 'అశరీరం శరీరేషు' అని శాస్త్రమే చాటుతున్నది. అది నారాయణుడే. అంటే పంచభూతాల కయనం లేదా అధిష్ఠానం Basis. దానికే ఆకారమూ లేదు వ్యాపారమూ Form or Function లేదు. ఎటు వచ్చీ అదే నా స్వరూపమని గుర్తించలేక ఆ నారాయణుడే నరుడై కూచున్నాడు. కనుక ఒక పండు రాలినట్టు ఒక భవనం కూలినట్టు ఈ శరీరం కృశించి నశిస్తుంటే దీనితోపాటు తానూ నశిస్తున్నాడు. అదే శోచనీయం. ఇక్కడ నరత్వమున్నంత వరకది ధార్మికమైన స్థాయి అయితే నారాయణత్వమనేది తాత్త్వికమైన స్థాయి అని అర్థం చేసుకోవాలి భావుకుడు.
అత్యేతి రజనీ యాతు -
సాన ప్రతి నివర్తతే
యాత్యేవ యమునా పూర్ణా -
సముద్ర ముదకాకులమ్ - 6
అసలది చేతనమేగాదు. అచేతనమే గాదు. ఏ పదార్ధమైనా సరే. కాలాని కధీనమై దాని చెప్పు చేతల్లో ఉండవలసిందే. కలయతీతి కాలః అన్నింటినీ ఎప్పటికప్పుడు మార్చి పారేసేదేదో అది కాలం. మార్పు చలనాత్మకం. ఒక దశ పోయి మరొక దశ రావటమే చలనం. అదే కాలం. చూడండి అండపిండ బ్రహ్మాండ రూపమైన ఈ విశ్వమంతా ఎప్పుడూ చలిస్తూనే ఉంటుంది.
Page 25