#


Index

యధా ఫలానాం పక్వానాం -
నాన్యత్ర పతనా ద్భయమ్
ఏవం నరస్య జాతస్య -
నాన్యత్ర మరణాద్భయమ్ - 4

  మంచిదే. కాని మన ఆత్మకు అంతం లేదంటున్నారు మీరు. అంతం లేదంటే మరణం లేదనే గదా అర్థం. మరణం లేకపోతే ఈ మరణిస్తున్న వ్యక్తి ఎవరంటారు. నరుడే గదా. నరస్య జాతస్య. ప్రతి ఒక్క నరుడూ ఎప్పుడో ఒకప్పుడు జన్మిస్తూ ఉన్నాడు. జన్మ ఉందంటే మరణం కూడా ఉండి తీరవలసిందే. రెండింటికీ అవినాభావం. అదే గదా అంతం వాడి జీవితానికి. నాన్యత్ర మరణాద్భయం - మరణిస్తామనే భయమెక్కడా లేదంటారేమిటి. ఇది అనుభవానికే విరుద్ధం కదా. దీనికి ధర్మ పురుషార్ధ దృష్ట్యా సమాధాన మేమంటే మరణమనేది సర్వనాశన మయిపోవటమని భ్రమపడుతున్నావు. అభావం కాదది, అవ్యక్తం. అంటే ఈ శరీరాన్ని వదిలేసి మరలా ఒక శరీరాన్ని ధరిస్తాడు మానవుడు. వదిలేసినప్పు డిక్కడ అవ్యక్తం Unmanifest వాడు. మరొక శరీరం ధరించినప్పుడక్కడ మరలా వ్యక్తమయికని Manifest పిస్తాడు. ఇదే జన్మాంతరం. ఇలా మరణానంతరం మరలా జననం ఆ జననాంతరం మరణం మరలా ఆ మరణానంతరం జనన మేర్పడుతుంటాయి కాబట్టి మరణిస్తే అక్కడికీ మానవుడాఖరై పోతాడు ఇకలేడని భయపడ నక్కరలేదు.

  ఇది ఎలాటిదంటే ఫలానాం పక్వానాం ఒక చెట్టుకొక కాయ కాసింది. ఆ కాయ బాగా పండింది. ఇప్పుడా పండు రాలి క్రింద పడిపోయిందను కోండి.

Page 21