#


Index

  అది తాత్కాలికమే. దక్కేయోగం లేకపోతే ఎంత ఎత్తుల కెదిగారో అంత పాతాళానికి పడిపోవలసి వస్తుంది. గత చరిత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకొండి. ప్రతి దేశంలో నిరంకుశ పరిపాలకుల జీవితంలో ఇలాటి పతనాన్ని వారెలా చవిచూచారో మీకే తెలిసిపోతుంది. కాబట్టి ప్రజా సామాన్యంలో మీరూ ఒకరనే సత్యాన్ని మరచిపోకుండా నిరహంకారంగా బ్రతకటం నేర్చుకోమని వారికిది హెచ్చరిక. అలాగే పారిశ్రామికులే గాదు. తత్తద్దేశ పాలకులే గాదు. సామాన్య గృహస్థులను కూడా మందలిస్తున్నది సంయోగా విప్రయోగాంతా అనే మూడవ వాక్యం. బంధుమిత్రాదులతో ఆలుబిడ్డలతో ఆలజాలంగా కాలం గడుపుతున్నాము గదా అని ఉప్పొంగి పోతున్నారేమో. అదీ ఎంతో కాలం సాగదా జీవితం. ఈ కలయికలన్నీ ఎప్పుడే క్షణంలో తొలగిపోయినా పోవచ్చు. అప్పుడెంత వాపోయినా ప్రయోజనం లేదు. కాబట్టి అది సంభవించే లోపుగానే దానికి మానసికంగా తయారయి ఉండండని హెచ్చరిక. పోతే ఇక ధనవంతులేమిటి రాజకీయ నాయకులేమిటి. సామాన్య గృహస్థులేమిటి. ఒక వర్గానికంటూ చెప్పటం కాదు. సమస్త మానవ కోటికీ సర్వసాధారణంగా చాటి చెప్పే ఆఖరి మాట ఏమిటంటే మరణాంతంచ జీవితమనేది. ఎంత భోగాలనుభవించినా ఎన్ని పదవులు కైవసం చేసుకొన్నా అలాగే ఆత్మీయులతో ఎన్నాళ్లు సుఖంగా గడిపినా చివరకెప్పుడో ఒకప్పుడింత జీవితమూ మరణంతో ముగిసిపోయేదే. ఆ తరువాత మనమూ లేమూ - మన అనుభవాలూ లేవు.

Page 18