#


Index

  అది ఎంతైనా ఉంది రాముడికి - కృతాత్ముడతడు. కృత అంటే సంస్కృత అని అర్థం. బాగా పరిశుద్ధమైన ఆత్మగలవాడు. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. మనస్సు బాగా పరిశుద్ధమైతే రజస్తమస్సులు క్షాళితమై సత్త్వశుద్ధి ఏర్పడుతుంది. అప్పుడాత్మవాన్ ఆత్మజ్ఞాన మున్నవాడవుతాడు. కర్తృత్వభోక్తృత్వాలకు సాక్షి అయిన ప్రత్యగాత్మ స్థాయి కెదుగుతాడని భావం. జీవభావం కన్నా పయి స్థాయి అది. ఆ స్థాయిలో ఉన్నవాడే సంకల్ప వికల్పాలతో నలిగిపోతున్న జీవాత్మ కేదైనా బోధించ గలడు.

  ఇక్కడ ధర్మ పురుషార్ధ మెలాటిదో అది వర్ణించి చెబుతున్నాడు వాల్మీకి మహర్షి కాని ఆయన మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. కృతాత్మా ఆత్మవాన్ - అన్నప్పుడది కేవలం ధర్మం వరకే ఆగక దాని కతీతమైన మోక్ష పురుషార్ధాన్ని కూడా సోకుతున్నది. మోక్ష భూమికలో ఉన్నవాడైతే కేవల మర్ధకామాలలో ఉండే మంచి చెడ్డలనే చెప్పగలడు. అనగా అంతకంతకు పయి లెవల్కు వెళ్ళిన వాడే క్రింది లెవల్ వాడికేది కావాలో అది మాత్రం చెప్పగలడు. అంతేగాని అంతకన్నా అతీతమైన దాన్ని బోధ చేయలేడు. ప్రస్తుతం రాముడవతార పురుషుడు గనుక కేవలం దశరధ రాముడు కాడు. ఆత్మారాముడు. తాను పరమాత్మనని తనలో తనకు బాగా తెలిపినవాడు. అదే కృతాత్మా ఆత్మవాన్ అనే మాటలలో మహర్షి చేస్తున్న సూచన. అలాంటి ఆత్మజ్ఞాన సంపన్నుడు గనుకనే అది

Page 11