#

Back

పురుషార్ధములు - వాని వివరణ

మానవుడు తన మానవత్త్వాన్ని నిలబెట్టుకోవాలంటే జీవితానికంతా లక్ష్య భూతమైన పురుషార్ధాన్ని సాధించక తప్పదు. ఐతే ఈ పురుషార్ధమంటే ఏమిటి? అది ఎన్ని విధాలు అనే ప్రశ్న వస్తుంది. జీవితాని కనుకూలమైన దర్ధం. ప్రతికూలమైన దనర్ధం. అనర్ధాన్ని పరిహరిస్తూ అర్ధాన్ని పాటిస్తూ పోవటమే పురుషార్ధ సాధన.

ఇలాంటి పురుషార్ధాలు మానవ జీవితాని కంతా కలిసి నాలుగే నాలుగున్నాయి. ఒకటి ధర్మం. మరొకటి అర్ధం. మరొకటి కామం ఇంకొకటి మోక్షం. చతుర్విధ పురుషార్ధాలంటే ఇవే. జీవిత సర్వస్వం వీటి లోనే ఇమిడి ఉంది. అందులోనూ ఈ నాలిగింటినే పరిగణించటంలో - వాటిని గూడా ఈ క్రమంలోనే పరిగణించటంలో కూడా ఒక చక్కని ఉపపత్తి ఉంది. ప్రతివాడూ తన ధర్మాన్ని ఆచరిస్తేనే కాని అర్ధమనేది లభించదు. అర్ధమంటే జీవితం సుఖంగా సాగటనికి కావలిసిన అన్ని వస్తువులు, అన్ని సౌకర్యాలు. అవి లభించిన తరువాత మానవుడి కామం లేదా వాంఛలన్నీ తీరిపోతాయి. ఐతే ఎంత సాఫల్య మిలా గలిగినా జీవితంలో అది సాంతమే, అనంతం కాదు. అనంతమైన సౌఖ్యాన్ని చూరగొనాలనే కదా మానవుడి అభిలాష. అది ధర్మార్ధ కామములనే మూడింటిలోనూ మనకు కానరాదు. దానికి సంబంధించిన పురుషార్ధం నాలుగవది ఐన మోక్ష మొక్కటే. మోక్షం మానవుడికి నిత్యమైన సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే అది పరమ పురుషార్ధమని పేర్కొన బడుతున్నది. మొత్తము మీద నాలుగూ కలసి జీవితాన్ని అంతటినీ ఆపోశనం పడుతున్నాయి. ఆయా వ్యాపారములు చేయటం - తన్మూలంగా అభిమతార్ధాల నన్నిటినీ పోగు చేయటం - అలా ఒనగూడిన వాటి నన్నిటినీ తనవిదీరా అనుభవించటమూ, అలాంటి సుఖానుభూతిని శాశ్వతం చేసుకోవటం - ఇంత కన్న జీవితమూ, జీవిత ధ్యేయమూ మరేమున్నది. కర్మాచరణతో ప్రారంభమై నిత్య సుఖప్రాప్తితో సమాప్తమవుతున్నది. మొదటిది సుఖం కోసం చేసే ప్రయత్నమైతే రెండవది దానికి ఫలభూతమైన సుఖానుభవం. సుఖానుభవమే గదా సమస్త పురుషార్ధ సారం.