వాడి బ్రతుకు. లాభం కలగక పోగా ఎంతో నష్టం పాలవుతాడు జీవితంలో. నససిద్ధి మవాప్నోతి. తాను చేసే పనులకెప్పుడూ సిద్ధి అనేది కలగదు. మధ్యలోనే చెడిపోవచ్చు. లేదా అసలు ఫలితమే లేకుండా పోవచ్చు. సత్ఫలితం మాత్రం కలగబోదు.
అంతేకాదు. నిషిద్ధ కర్మ లాచరించినందు వల్ల సత్కర్మలు శాస్త్రోక్తమైన వాచరించక పోవటం వల్ల సిద్ధి కలగక పోవటమలా ఉంచి న సుఖం పరాంగతిం వాడి కిహంలో సుఖంగా బ్రతికే యోగం లేదు. పోతే పరంలో ఉత్తమ గతులూ లేవు. ఇహ పరాలకు రెంటికీ దూరమై అధోగతి పాలయిపోతుందా జీవితం. మానవుడై పుట్టినందుకు మానవుడి కర్తవ్యమేమిటో తనకు తానై తెలుసుకోవాలి లేదా. శాస్త్రోపదేశంతోనైనా గ్రహించాలి. ఏదీ లేకపోతే ఏమవుతాడు. పురుషార్ధానికే నోచుకోక పాడయిపోతాడు.
తస్మా చ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యా కార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం - కర్మ కర్తు మిహార్షసి - 24
ఇంతకు ముందు ప్రతిలోమంగా Negative way చెప్పిందిప్పుడు అనులోమంగా Positive Way బోధిస్తున్నాడు గీతాకారుడు. శాస్త్రజ్ఞానం లేకపోతే మానవజీవితం గమ్యం లేని ప్రయాణమవుతుంది. కాబట్టి మోక్షమనే గమ్యాన్ని చేరాలనే శ్రద్ధాసక్తులంటే మాత్రం మానవుడెప్పుడే గాని శాస్త్ర సక్తులంటే మాత్రం మానవుడెప్పుడే గాని శాస్త్ర విషయం