అధశ్చమూలా న్యను సంతతాని కర్మాను బంధీని మనుష్యలోకే. రావిచెట్టు గదండీ ఇది. రావీ జువ్వీ మల్టీ ఇలాటి వృక్షాలకు ఊడలని ఉంటాయి. ఏదోగావవి కూడా దాని వేళ్లే. వేళ్లే మరలా కొమ్మలో నుంచి బయలుదేరి క్రిందికి దిగిపోతాయి. అవి నేలలో పాతుకుపోయి మరలా ఎన్నో చెట్లక్కడ ఉన్నట్టు భ్రాంతి గొలుపుతుంటాయి. అందుకే అధశ్చమూలాన్యను సంతాతాని. క్రిందికి కూడా దిగిపోతున్నాయా వేళ్లంటాడు. అదేమిటి. ఇంతకు ముందు ఊర్ధ్వమూలం వేరుపైన ఉన్నదన్నాడు. ఇప్పుడు అధశ్చమూలాని. క్రింద గూడా కనిపిస్తున్నాయి వేళ్లంటాడు. ఇదొక వింత. కొమ్మలు క్రిందకున్నాయని చెప్పి పైకీ ఉన్నాయని మళ్లీ చెప్పటమొక వింతైతే వేరు పైనా ఉంది క్రిందా ఉన్నాయని చెప్పటం ఇంకొక వింత. ఈ వేళ్లవో గావు. చెట్టుకున్న ఊడలే నని అర్థం చేసుకొంటే సరిపోతుంది. అది కూడా అను సంతతాని. బాగా ఒకదానికొకటి చుట్టుకొని పెన వేసుకొని ఉన్నాయట.
ఏమిటవి ఇంతకూ. కర్మానుబంధీని - కర్మలూ వాటి వల్ల కలిగే సుఖదుఃఖాదులూ. కర్మలేమిటి. ఎవరు చేస్తున్నారీ కర్మలు. తన్నిమిత్తంగా సుఖదుఃఖా లెవరను భవిస్తున్నారు. వృక్షమా. వృక్షమెప్పుడూ ఏదీ గానీ అనుభవించదు. అందులో ఇది సంసార వృక్షమసలే లేదను భవం దానికి. మరొకరి కనుభవ మివ్వటానికే ఉందది. ఎవరా మరొకరు. ఎవరున్నారిక.