#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

పెత్తనం చెలాయిస్తుంటాడు. అలా చెలాయిస్తేనే వాడీశ్వరుడని పించుకుంటాడు Master or Commander. లేకుంటే వాడూ జీవుడే కావలసి వస్తుంది.

  అయితే ఒక మాట. ఈశ్వరుడు దగ్గర పెట్టుకొన్న ఈ ప్రకృతి అనేది ఒకటి గాదు. రెండు ప్రకృతులు. ఒకటి పర. మరొకటి అపర. అపర వల్ల వాడు నామరూపాత్మక జీవరూపంగా ప్రవేశించాడు. జీవుడిది సృష్టి కాదు. ప్రవేశం. కారణమేమంటే జీవుడంటే జ్ఞాన స్వరూపుడు. నేను నేననే జ్ఞానమీశ్వరుడికెలా ఉందో మనబోటి జీవులకు కూడా అలాగే ఉందిప్పుడు. జ్ఞానం నిరాకారం వ్యాపకం. కాబట్టి దానినెవరూ సృష్టించ నక్కర లేదు. సృష్టి అంటే మార్పు. మార్పు ఎప్పుడూ సాకారానికే నిరాకారానికి కాదు. మన జ్ఞానమలా సాకారం కాదు. సాకారాన్ని గమనిస్తుంటుందది. కనుక జీవుడిది సృష్టి కాదు. జగత్తుదే సృష్టి. మరి జీవుడెలా వచ్చాడంటారు. ఈశ్వరుడే జీవరూపంగా ప్రవేశించాడు. బ్రహ్మాండ శరీరంలో హిరణ్య గర్భరూపంగా. పిండాండ శరీరంలో మనబోటి జీవుల రూపంగా. సమష్టి జీవుడైతే Cosmic person వాడు హిరణ్యగర్భుడు. గర్భంలో ఈశ్వర చైతన్యమున్న వాడని అర్ధం. అలా ఉన్నా దాన్ని గుర్తించ లేని వ్యష్టి జీవుడైతే Individual soul. r Consciousness సజాతీయమే గనుక ఈశ్వరుడూ హిరణ్యగర్భుడూ జీవుడూ అని విభక్తంగా