ఆత్మసంయమ యోగము
భగవద్గీత
అథ చిత్తం సమాధాతుం - నశక్నోషి మయి స్థిరం
అభ్యాస యోగేన తతో మా మిచ్ఛాప్తుం ధనంజయ - 9
ఇప్పుడిక సాధన మార్గమనేది సోపాన క్రమంలో వర్ణిస్తూ పోతాడు గీతాచార్యుడు. ఆరోహణాత్మకంగా కాదు. అవరోహణాత్మకంగా. నాలుగే నాలుగు భూమిక లున్నాయి ఇందులో. అందులో ఒకటి కాకుంటే ఒకటి పట్టుకొని పొమ్మని సలహా. సగుణంలోనే ఇది. నిర్గుణంలో కాదు. అందులో కూడా ఉత్తరోత్తరం కన్నా పూర్వ పూర్వం ప్రశస్తమైనది. అన్నిటికన్నా ప్రశస్తమైనదేదో ఇంతకు ముందే వర్ణించాడు మహర్షి. మయ్యేవ మన ఆధత్స్వ వగైరా అలాటిదే. పోతే దానికి వెంటనే నోచుకోకపోతే సిఫారసు చేస్తున్నాడిప్పు డంత కన్నా క్రింది భూమికను.
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి. మొదటి భూమికలో నేను వర్ణించిన విధంగా నీవు నీ మనసూ బుద్ధి మయి సమాధాతుం నాలో స్థిరంగా నిలపటానికి చేతకాకపోతే. అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం. అభ్యాస యోగంతో నన్ను పట్టుకోటానికి ప్రయత్నించు అని సలహా ఇస్తాడు. అభ్యాసమేమిటి. యోగమేమిటి. వ్రాస్తున్నారు భాష్యకారులు. చిత్తస్య ఏకస్మి న్నాలంబనే సర్వతః సమాహృత్య పునః పునః స్థాపనం అభ్యాసః మనసుతోనే గదా ఏదైనా చేయవలసింది. మనసే సాధన మన్నింటికీ. లోకానుభవం మొదలుకొని బ్రహ్మానుభవం వరకూ మనసుకే కలగాలి ఏ
Page 509