కర్మసన్యాస యోగము
భగవద్గీత
అది ఆ విశ్వేశ్వరుడిలో చూచినా నామరూపాలే. ఆయన నేత్రశ్రోత్రాదులుగా చూచినా నామరూపాలే. ఆయనను వదిలేసి వసురుద్రా దిత్యాదులను వేటిని చూచినా అవీ నామరూపాలే. అధిష్ఠానమేదీ గాదు. అంతా ఆరోపితమే.
కనుకనే పశ్యామి త్వాం దర్నిరీక్ష్యం సమంతా దీప్తా నలార్క ద్యుతిమ ప్రమేయం - చూస్తున్నానే గాని చూడలేక పోతున్నాని తానే వాపోతున్నాడు. చూస్తున్నది ఆరోపితమైతే చూడలేనిది దాని అధిష్ఠానం. ఎందుకు చూడలేడది. అప్రమేయమని జవాబు. ప్రమాణానికి గోచరం కాని దప్రమేయం. విశ్వమెంతటిదైనా మనకు ప్రమేయమే. మర్త్య దృష్టికి మర్త్యమెలాగో దివ్యదృష్టికి దివ్యమైనదీ ప్రమేయమే కావాలి. కాని అప్రమేయ మంటున్నాడు. ఏమిటది. మర్త్యమూ దివ్యమూ కాదు. అసలు విశ్వమే కాదది. విశ్వేశ్వరుడు. అంటే విశ్వమంతా వ్యాపించిన ఆత్మ చైతన్యం. ఆత్మ ఎప్పుడూ ప్రమాణానికి గోచరించదు. దానికే సమస్త ప్రపంచమూ గోచరిస్తుంది. దుర్నిరీక్ష్యమది. తేరిపార జూచేది కాదు. ప్రమేయం కాదు గదా. అప్రమేయాన్ని ఎలా చూడగల డెవడుగానీ. అందుకే దుర్నిరీక్ష్యమని ఏమి చెప్పాలో తెలియక గాబరా పడుతున్నాడర్జునుడు.
త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య సర్వస్య పరం నిధానం
త్వమవ్యయః శాశ్వత ధర్మ గోప్తా
సనాతన స్త్వం పురుషో మతో మే - 18
Page 405