కాగా సమస్తాన్నీ హరించే మృత్యు వెవరోగాదు నేనే. కాల మెప్పుడయ్యాడో మృత్యువు కూడా తానే కాక తప్పదు. భవిష్యతాం భవిష్యత్తులో పుట్టబోయే వారందరికీ జన్మ స్థానం కూడా నేనే. అంటే జనన మరణాలు రెండూ పరమాత్మ వల్లనే. అలాగే కీర్తీ - లక్ష్మీ - వాక్కూ స్మృతి మేధా ధృతి క్షమాది ఉత్తమ గుణసంపత్తి కూడా స్త్రీ జాతికి సంబంధించింది నేనే. దాని ఆభాసను చూచే ధన్యుల మయ్యామని భావిస్తుంటారు లోకులు. వాటి స్వరూపమే పరమాత్మ అని చెప్పినప్పుడిక ఏమను కోవాలి.
బృహత్సామ తధా సామ్నాం - గాయత్రీ ఛందసా మహమ్
మాసానాం మార్గ శీరోహ - మృతూనాం కు సుమాకరః - 35
సామ గీతాలలో ప్రధాన మైన బృహత్సామం నేను. అనుష్టుప్ త్రిష్టుప్ జగతీ ఇలాటి సప్త ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు నేను. మరి ద్వాదశ మాసాలలోనూ మార్గ శిర మాసాన్ని. వసంతాది షడృతువులలో వసంత ఋతువును. వేదానాంసామ వేదోస్మి అని ఇంతకు ముందు చెప్పాడు. అక్కడ నాలుగు వేదాలలో సామవేదం నేనని చెప్పాడు. ఇక్కడ అలా కాదు. సామవేదంలో కూడా సారభూతమైన బృహత్సామ నంటున్నాడి దీ విశేషం.
ద్యూతం ఛలయతా మస్మి తేజస్తే జస్వినా మహం
జయోస్మి వ్యవసాయోస్మి - సత్త్వం సత్త్వవతా మహమ్ - 36
Page 336