#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

ఇక చాలు ననే తృప్తి నాకు కలగటం లేదంటాడు. ఇప్పుడూ అంటుంటా రిలాంటి మాటలే చాలా మంది శిష్యులూ శ్రోతలూ. గురువుగారు లోతుకు దిగి తానను భవిస్తూ తన అనుభవాన్నే మాటల ద్వారా బయట పెట్టినా ఆహా ఎంత అనుగ్రహ భాషణమిది- అమృతాన్ని ఆస్వాదించి నట్టుంది మాపాలిటి కింకా చెప్పండి వింటామని అభిలాష వెలిబుచ్చు తుంటారు. అది ముఖప్రీతిగా అనే మాటలేగాని నిజంగా గురువుగారి స్థాయి నందుకొని ఆనందంతో వ్యక్తం చేసే మాటలు కావు.

హంత తే కథయిష్యామి - దివ్యా హ్యాత్మ విభూతయః
ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తర స్యమే - 19


  అందుకే దానికి తగినట్టే జవాబిస్తున్నాడు పరమాత్మ. అర్జునా నీకు కావలసింది దివ్యాహ్యాత్మ విభూతయః - దివ్యమైన నా విభూతులే గదా. వక్తు మర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః అని అవి చెప్పమనే గదా అడిగావు. చూచారా ఈ మాట. అర్జునుడింతకు ముందు ఏది చెప్పమని అడిగాడో ఆ మాటలే పొల్లు పోకుండా మరలా ఏకరువు పెడుతున్నాడు. ఏదో వెటకారం చేస్తున్న ట్టనిపిస్తుందీ మాట మనకు. అంటే ఏమిటో తెలుసా. నా స్వరూపం తెలుసుకోకుండా కేవలం నా విభూతినే పట్టుకొంటే ఏమి ప్రయోజనం. అది నీ జీవిత సమస్య కెలా పరిష్కారమని ఎత్తి పొడుస్తున్నట్టుందీ మాట. సరే అడిగావు కాబట్టి వినాలని నీకు ఎక్కడ లేని కుతూహలం కూడా ఉంది కాబట్టి కాదనటం దేనికి. తే కధ యిష్యామి.

Page 318

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు