#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 21 ||

  అయినా వీడు చంపాడు - వాడు చచ్చాడు. వాడు వీణ్ణి చంపించాడని లోక వ్యవహారమొకటి మనలను కలవరపెడుతూనే ఉంటుంది. అనుభవంలో ఉండే దానిని మనం కాదనలేము గదా. ఎలా మనకు మనం సమాధానం చెప్పుకోవాలా అని ప్రతి ఒక్కళ్ళమూ ఈ విషయంలో మధన పడుతుంటాము. ఎందుకంటే శాస్త్ర మేదీ లేదు అంతా హుళక్కేనని చాటుతున్నది. అనుభవం దానికి విరుద్ధంగా మన కేర్పడుతున్నది. పరస్పర విరుద్ధంగా తోస్తున్న ఈ రెండు మార్గాలనూ సమన్వయించుకొని చూడట మెలాగా అని మధన పడటం సహజమే.

  దీనికొక్కటే పరిష్కార మార్గం. అది భగవత్పాదుల మాటల్లో వినండి. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. ఆక్షేప సమాధాన రూపంగా నడిచేది గదా భాష్యమంటే. మొదట ఆయనగారే ఆక్షేపిస్తున్నారు. ననూక్త ఏవ ఆత్మనః అవి క్రియత్వం కర్మా సంభవ కారణ విశేషః - సత్యముక్తం న తు స కారణ విశేషః అన్యత్వా ద్విదుషః అవిక్రియా దాత్మనః - నహి అవి క్రియం స్థాణుం విదిత వతః కర్మ న సంభవతి ఇతిచేన్న - విదుషః ఆత్మ త్వాత్. కర్మ చేసినా చేయటం లేదని భావించట మేమి న్యాయం. ఎలా చెప్పగలరు. ఏమిటి అందులో మీరు చూపగల ఉపపత్తి. ఆత్మ అవిక్రియం. అందువల్ల ఏ పనీ జ్ఞాని అయిన వాడి కంటదంటారా.

Page 93

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు