#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

మరణించదు. జనన మరణాలనేవి ఆరు భావ వికారాలలో మొదటిది చివరిది అవి రెండూ లేవని చెప్పటం మూలాన మధ్యలో ఉండే నాలుగూ లేవని వేరే చెప్పనక్కరలేదు. నిర్వికారమైన దాత్మ అని అర్ధమవుతున్నది. నాయం భూత్వా భవితా వాన భూయః అది ఒకప్పుడుండి మరొకప్పుడు పోయేదీ కాదు. అలాగే అంతకు ముందు అభూత్వా వా భవితా - లేకుండా పోయి కాలాంతరంలో శరీరంలాగా పుట్టుకు వచ్చేదీ కాదు. అసలు జన్మే లేదు దానికి. జన్మలేదు గనుకనే మరణమూ లేదు. అజమూ అమరమూ అది. ఆనాత్మ లాగా ఆగమా పాయాలు లేనిదని భావం.

  అంతేకాదు. ఆద్యంతాలు లేవని రెండు కొసలూ కొట్టి వేయటం మూలంగా మధ్యలో కలిగే వికారాలు కూడా వాటంతట అవి కొట్టు పడిపోయినా - అవి కూడా కంఠోక్తిగా చెబితే నిస్సందేహంగా స్పష్టంగా ఉంటుందనే అభిప్రాయంతో మరలా వర్ణిస్తున్నది గీత. అజోనిత్యః శాశ్వతోయం పురాణః అని శాశ్వత మనే మాట అపక్షయ మనేది లేదని కొట్టి వేస్తున్నది. అపక్షయ మంటే తరిగిపోవటం కదా. ఆత్మ స్వరూపతః క్షీణించదు. కారణం నిరవయవ మది Indivisible గుణ క్షయం వల్లనూ క్షీణించదు. కారణం నిర్గుణమది. కనుక శాశ్వతం. శశ్వత్ ఎప్పుడూ భవం ఒకేలా ఉంటుందని అర్ధం.

  అపక్షయ మెప్పుడు లేదో దానికి ప్రతీపమైన వృద్ధి లక్షణం కూడా లేదాత్మకు. అది పురాణం. ఏది అవయవాల బలంతో పెరిగి పెద్దదవుతుందో

Page 91

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు