#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

అలాగే శాస్త్రం కూడా అతద్ధర్మా ధ్యారోపణ మాత్ర నివర్తక త్వేన ప్రమాణత్వం ఆత్మనః ప్రతిపద్యతే - న తు అజ్ఞాతార్ధ జ్ఞాపకత్వేన. ఆత్మ కనవసరంగా మన బోటిలోకు లారోపించిన నామరూపాది ధర్మాలను త్రోసి పారవేయటం వరకే ప్రమాణంగా పనిచేస్తుందేగాని మనకు తెలియని మన స్వరూపాన్ని ఇదుగో నీ స్వరూపమని సాక్షాత్తుగా చూపటానికి గాదు. యత్సాక్షా దపరోక్షా త్తం టున్నప్పుడది చూపితేనా నేనున్నానని నా ఆత్మను నేను పట్టుకోవలసింది. చూపకపోతే నేనున్నానని నాకు తెలియదా అని త్రోసిపుచ్చారు వారు.

  కాబట్టి ఆత్మ అప్రమేయం. ప్రమేయం లాగా నశించేది కాదు. కనుక తస్మాద్యుధ్యస్వ భారత. నీవు యుద్ధం చేసినా తప్పు లేదు. నిశ్చింతగా చేయవచ్చు. యుద్ధమనేది ఇక్కడ ఉపలక్షణం. అన్ని ఇంద్రియ వ్యాపారాలకూ సూచకం. ఏ పనిచేసినా అందులో ఆత్మ వ్యతిరిక్తంగా ఏదీ లేదు కాబట్టి చేసినా చేయటం కాదది. మృగతృష్టికలో దిగి స్నానం చేశామనుకొండి. అది స్నానమంటావా. పానం చేస్తే అది పానమంటావా. కర్మణ్య కర్మయః పశ్యేత్. కర్మలన్నీ కర్మలే గావు అకర్మలని తరువాత చెప్పబోతుంది గీత.

య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || 19 ||

  ఏ పని చేసినా అది కర్మగాదు అకర్మేనని సిద్ధాంతం. చేస్తే అది ప్రమాదం గదా అని ఇప్పుడు ప్రశ్న వస్తుంది. గీత మనకు సిద్ధాంతరీత్యా

Page 86

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు