సాంఖ్య యోగము
భగవద్గీత
అర్ధం. ఆకాశం మన జ్ఞానానికి గోచరిస్తున్నదా కాదా ఇప్పుడు. ఇది ఆకాశమెంతో దూరం విస్తరించి ఉన్నదని చెబుతున్న దెవరిప్పుడు నీనా జ్ఞానమే గదా. జ్ఞానేనహి ప్రమాణేన అంటారు భగవత్పాదులు. జ్ఞానమే చివరకు ప్రమాణం. ప్రమాణానికి ప్రమాణ మక్కర లేదు. అదే ప్రమాణ మయినప్పుడు దానికి మరి ప్రమాణం Proof or Evidence దేనికి. తానున్నాని తానే అనుకోగలదది. తన ఉనికి తాను గుర్తిస్తూ మరొకటి గూడా ఉందని గుర్తిస్తున్నది. ఆ మరొకటి క్రిందికి వస్తుంది ఆకాశం మొదలుకొని సమస్త ప్రపంచం కూడా. కనుక ఆకాశం కూడా. ప్రమేయమే గాని అప్రమేయం కాదు. అప్రమేయం స్వతః ప్రమాణమైన ఆత్మ చైతన్యమొక్కటే.
నను ఆగమేన ఆత్మా పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినాచ పూర్వమ్ అని ఇక్కడ ఒక ఆక్షేపణ లేవదీశారు భాష్యకారులు. ఆత్మ ఒకటి ఉంది అది ఫలానా అని నీకెలా తెలిసింది. నేనున్నాననే ప్రత్యక్ష ప్రమాణం వల్లనే గదా గ్రహించావు. అలాగే శాస్త్రమనే ప్రమాణం కూడా చెబుతున్నది గదా ఆత్మానం చే ద్విజానీయా త్తని. అలాంటప్పుడాత్మ అప్రమేయమెలా అయింది. దాని కాయనే చేశారు పరిహారం. సిద్ధేహి ఆత్మని ప్రమాతరి ప్రమిత్సోః ప్రమాణా న్వేషణా భవతి అని మొదట ఒక ప్రమాతగా knower నే ననేవాడను లేకపోతే ప్రమాణంతో ఒక ప్రమేయాన్ని గ్రహించాలనే బుద్ధి నాకేర్పడదు. కాబట్టి ప్రమాణం చెబితే నేను లేను. నేనుంటేనే ప్రమాణం పని చేస్తున్నది. కాబట్టి ప్రత్యక్షం ద్వారానా ఉనికి గాదు. నా ఉనికి ద్వారా ప్రత్యక్షం.
Page 85