సాంఖ్య యోగము
భగవద్గీత
ఉండటం స్వభావం. అది తనకు అన్యమైన ఏ తాటాకునో కాగితాన్నో మండిస్తుందేగాని తన్ను తాను మండించుకోగలదా మండించటం దేనికి - మంటే అది అయినప్పుడు. అలాగే ఆత్మ కూడా తన్ను తాను నశింపజేసుకొనట మసాధ్యం. తనకు భిన్నంగా మరొకటేదీ లేదు కాబట్టి మరొక దానివల్ల నశిస్తుందనే మాటా అర్ధం లేని మాటే.
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత || 18 ||
ఆత్మ నశించేది కాదని చెప్పారు గదా. అయితే ఇక నశించే పదార్ధ మేదంటారు. అంతవంత ఇమే దేహా - ఇదుగో ఈ శరీరమనః ప్రాణాదులే నశించేవి. అంతవంతమివి. అంతమంటే కొస. అది ఒకటిగాదు. రెండు. ఒక పదార్ధ ముందంటే దానికాదీ ఒక కొసే. అంతమూ ఒక కొసే. రెండు కొసలూ అంతాలే. అందులో మొదటిది జననమూ. రెండవది మరణమూ. ఇవి రెండూ లేని పదార్థ మీ సృష్టిలో లేదు. చేతనమైనా అచేతనమైనా ఏదైనా ఒకప్పుడు పుట్టి మరొకప్పుడు గిట్టవలసిందే. ఒక కుండ తయారుచేస్తే పుడుతుంది. పగిలిపోతే పోతుంది. ఒక చెట్టు విత్తనంలో నుంచి పుడుతుంది. మళ్లీ విత్తనంగా మారిపోతుంది. అలాగే ఒక మానవుడూ పుడతాడు పోతాడు.
అయితే అలా పుడుతూ పోతూ ఉన్నప్పుడేది ఆ పుట్టటం ఏది ఆ పోవటం అని ఎప్పుడైనా ఆలోచించావా. అది పైకి కనిపించే
Page 83