#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

అనుభవంలో లేదే గాని వస్తు సిద్ధంగా By itself అది ఎప్పుడూ ఉంది. జీవించినా ఉంది. మరణించినా ఉంది. దానికి మరణం లేదు. కారణం అవ్యయ స్యాస్య. అవ్యయమది. వ్యయం కానిది. వ్యయమంటే ఖర్చు మారిపోవటం. ఆకారంలేని దెలా మారుతుంది. మన జ్ఞానమూ ఇప్పుడలాంటిదే గదా అంటావేమో. నిజమే. ఇదీ నిరాకారమే. కాని సాకారమైన మనః ప్రాణ శరీరాలను నెత్తిన వేసుకొని సాకారమని బోల్తా పడుతున్నది. కాబట్టి వస్తుతః నిరాకారమైనా బుద్ధితః కాదు. అంచేతనే రేపు మారిపోతుంది. మాసిపోతుంది. అది మనః ప్రాణాది ఉపాధులతో సంబంధం లేని నిరుపాధికమైన Absolue చైతన్యం కాబట్టి దానికి వినాశం లేదు.

  వినాశ మవ్యయ స్యాస్యన కశ్చి త్కర్తు మర్హతి - ఒకవేళ ఎవడైనా దాన్ని నశింప జేయాలనుకొన్నా నశింప జేయలేడు. ఎందుకంటే దానికి భిన్నంగా ఎవడూ లేడు. అంతా అదే వ్యాపించి ఉన్నప్పుడంతా దాని స్వరూపమే గదా. నశింపజేస్తా ననుకొన్న వాడూ దాని స్వరూపమే. స్వరూపమంటే ఆత్మే. ఆత్మే అయినప్పుడది తన్ను తాను ఎలా చంపుకోగలదు. నకశ్చి దాత్మానం వినాశయితుం శక్నోతి ఈశ్వరోపి. వాడెంత సమర్థుడైనా ఆ పనిచేయట మసంభవ మంటారు భగవత్పాదులు. ఇంకా ఒక మాట కూడా చెబుతారాయన. స్వాత్మని క్రియా విరోధాత్. ఏ క్రియ కూడా తన విషయంలో తనకు సంభవించదు. అగ్నికి మండుతూ

Page 82

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు