#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

అంతర్వ్యాస్తే గాదు. స్వరూప వ్యాప్తి కూడా. ఆభరణాల పైభాగమంతా బంగారమే. అది బహిర్వ్యాప్తి. లోపల కొట్టి చూస్తే బంగారమే. అది అంతర్వ్యాప్తి. అంతేగాక దాని ప్రతి అణువువూ బంగారమే. అది స్వరూప వ్యాప్తి. ఇలా ప్రత్యణువూ అందులో బంగారమే అయితే ఇక ఆభరణమనేది ఎక్కడ ఉంది. ఉందని ఎవరు చెప్పారు. సువర్ణానికి వ్యతిరిక్తంగా అది ఒకటి ఉందనుకోటం మన భ్రాంతి. అలాటి భ్రాంతే ఇప్పుడీ ప్రపంచమంతా. దీనినంతటినీ అత్మ చైతన్యమే వ్యాపించి ఉందిప్పుడు. ప్రతి ఒక్కటీ అస్తి భాతి - ఉందనే స్ఫురణే గదా. ఆ స్ఫురణను మినహాయిస్తే ఏ పదార్ధం గానీ ఎక్కడ కనిపించింది నీకు. మహా అయితే స్ఫురణే Consciousness ఆ రూపంలో కనిపిస్తున్నదని చెప్పాలి నీవు.

  అలాంటప్పుడిక వినాశమనే దేముంది ఆత్మకు. అనాత్మ భూతమైన ఈ శరీరాది సంఘాతం పోయినా దీనితో మమేకమైన నేరానికీ జీవాత్మ తొలగిపోయినా సామాన్య రూపమైన ఆ ప్రత్యగాత్మ ఎక్కడికీ పోదు. పోవటానికది ఈ మనస్సూ ప్రాణమూ వీటితో చేతులు కలిపితే గదా. కనుక ఇది శరీరాన్ని అంటిపట్టుకొని నప్పుడూ ఉందది. ఇవి మరణకాలంలో దీన్ని వదిలేసి పోయినప్పుడూ ఉంది. ఆకాశంలాగా ఆ మృత శరీరం లోపలా వెలపలా వ్యాపించే ఉంది. విశేష జ్ఞానానికి తెలియదది తనకు తన శరీరానికీ సాక్షిగా అక్కడే ఉందని. దీనికి తెలియకున్నా దానిపాటికది ఉంది. అవిద్యావశాత్తూ ఈ జీవుడి

Page 81

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు