#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

ఆత్మ కంతం లేదు వాస్తవానికి. అది సత్యం జ్ఞాన మనంతం. దానికంత మేదైనా ఉందంటే అది అనాత్మే అది కూడా ఆత్మ చైతన్యంతోనే నిండి ఆత్మగానే దర్శన మిస్తున్నప్పుడిక అంతమేమిటి - చూడటమేమిటి. అలాగే అసత్తీ అనాత్మ జగత్తే. ఇది అసలు లేనే లేనప్పుడిక దీని కంతమేమిటి మనం చూడటమేమిటి.

  మరి ఏమిటీ మాటల కర్ధం. ఎందుకిలా చెప్పింది గీత. పైగా అదే తత్త్వ దర్శన మంటున్నదే. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనమొక ధర్మ సూక్ష్మమిక్కడ. సద సత్తుల అంతమిక్కడ సద సత్తులు కావు. అంటే దానికంత మిది దీనికంత మది అని గాదు. మరేమిటి. రెండింటికీ కలిసి అంతమొకటి ఉంది. అది అపరోక్షమైన నా స్వరూపం. అదే ఆత్మ. అది సత్తు కాదు. అసత్తు కాదు. సత్తన్నానో అసత్తది కాదా అని ప్రశ్న వస్తుంది. అసత్తన్నానో సత్తు కాదా అని అడుగుతావు. ఏ ఒక్కటని చెప్పినా అది సర్వ వ్యాపకమైన ఆత్మ కాదు. అవి రెండూ కలిసి ఎక్కడ అంతమయి పోతాయో ఎందులో లయమయి పోతాయో అది అఖండమైన ఆత్మ స్వరూపమని భావం. కనుకనే నసత్త న్నా సదుచ్యతే అని క్షేత్ర జ్ఞాధ్యాయంలో రాబోతుంది ఒక వాక్యం. అది సత్తూ కాదు అసత్తు కాదు అర్జునా అని స్వయంగా చాటి చెప్పాడు పరమాత్మ. కాబట్టి అలా సద సత్తులనే ద్వంద్వాలను రెంటినీ కలిపి నిర్ద్వంద్వంగా ఏకంగా దర్శించినప్పుడే అది తత్త్వ దర్శనమని గీతా హృదయం.

Page 77

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు