#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

లేదని తెలుసుకో. ఎప్పుడూ ఉన్న ఆత్మ చైతన్యమే ఉందని గుర్తించమని. అయితే ఇది లేదని ఎప్పుడర్ధ మవుతుంది మనకు. అది ఉందని గుర్తించినప్పుడు. వస్తువును గుర్తించినప్పుడే ఆభాస ఆభాస అయిపోతుంది. అంతవరకూ ఆ భాసే Appearance వాస్తవమయి దాని కాధార భూతమైన వస్తువే Reality ఆ భాస అని భ్రమ గొలుపుతుంది.

  ఇది ఎలాటిదంటే చీకట్లో మనకొక సర్పం కదలిపోతున్నట్టు భాసిస్తుంది. అది సర్పం కాదు. ఒక తెల్లని నిడుపాటి త్రాడు. ఆ రజ్జువే గాలికి కదులుతుంటే ప్రాకుతూపోయే సర్పమని అపోహపడ్డాము. తన్మూలంగా తాడబద్దమయి పాము నిజమయింది మన పాలిటికి. వాస్తవంలో పామే అసత్యం త్రాడే సత్యం. ఎప్పుడు గ్రహించగలమీ సత్యం. త్రాడును చూడక పామును చూస్తున్నంత వరకూ తెలియదు. అలాగే ఆత్మజ్ఞానం లేనంత వరకూ ఈ మాత్రా స్పర్శలూ శీతోష్ణాదులూ సుఖదుఃఖాదులైన ద్వంద్వాలూ ఈ అనాత్మ జగత్తంతా వాస్తవంగానే ఉందనే భ్రాంతి మనకు తొలిగిపోదు. రజ్జు దర్శనమయినట్టు ఆత్మ దర్శనం కావాలి మనకెప్పటికైనా.

  అది ఎలాగ అంటే చెబుతున్నది గీత - ఉభయో రపి దృష్టోంత స్వనయో స్తత్త్వ దర్శిభిః సద సత్తులు రెండింటి అంతమూ ఎప్పుడు చూడగలవో అప్పుడే నీవు తత్త్వాన్ని చూచినవాడ వవుతావు. సత్తు ఆత్మ - అసత్తు అనాత్మ ప్రపంచమని గదా వర్ణించాము. సత్తు కంతమంటే

Page 76

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు