#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

పోతున్నది. కనుక మన కనుమానం మరణానంతరం మన ముంటామో లేదో ఏమయి పోతామో నని. అలా అనుమానించ నక్కరలేదు. తప్పకుండా ఉంటాము మనం. ధీర స్తత్ర న ముహ్యతి. ధైర్యం లేక నీవు బెంబేలు పడుతున్నావు. ధైర్యంతో ఉంటే నీకెలాటి వ్యామోహమూ లేదని హామీ ఇస్తున్నాడు భగవానుడు.

  ధీర స్యాస్తీతి ధీరః - తస్య భావః ధైర్యం. ధీ అంటే బుద్ధి. అది ఉన్నవాడే ధీరుడు. వాడికున్న లక్షణమే ధైర్యం. అంటే ఏమిటర్ధం. ధీ లేదా బుద్ధి అనేది రెండు విధాలు. ఒకటి నేనీ దేహం మాత్రమే కాను. ఇందులో కర్తగా భోక్తగా అన్నీ చేస్తూ అనుభవిస్తూ ఉన్న జీవుణ్ని Active Self అనే బుద్ధి. మరొకటి కర్తృత్వ భోక్తృత్వాలు కూడా నాకు లేవు. ఈ కలా పాని కంతా కేవలం సాక్షిరూపంగా ఉన్న ద్రష్టను Witnessing Self నేననే బుద్ధి. వీటిలో మొదటిది జీవాత్మ భావం. రెండవది ప్రత్యగాత్మ భావం రెండింటిలోనూ ఆత్మకు వినాశం లేదు. మరణానంతరం కూడా ఉందనే నమ్మక ముంది. కాని తేడా ఎక్కడంటే ప్రస్తుతం మనకున్న ఈ స్థూల దేహ మిక్కడ పతనమై పోయినా మరొక సూక్ష్మదేహంలో కూచొని ఎక్కడికో వెళ్లిపోతామని మరలా కర్మభూమిలో జన్మిస్తే ఇంకొక దేహంలో ప్రవేశిస్తామని - కనుక మరణం మనలను పూర్తిగా నశింపజేయదని నమ్ముతాడు జీవాత్మ వాది. అలాటి దృష్టి ననుసరించి చెబుతున్నాడు.

Page 60

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు