ఆత్మసంయమ యోగము
భగవద్గీత
ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః |
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే || 39 ||
ఇదే నాకు పట్టుకొన్న పెద్ద సమస్య. దీన్ని పరిష్కరించ వలసిన బాధ్యత నీదే. ఛేత్తు మర్హస్య శేషతః - పూర్తిగా దీన్ని పరిష్కరించగల వాడవు కూడా నీవే. ఎంచేతనంటే త్వదన్యః నీవు తప్ప వేరొకడు - వాడు దేవుడే కావచ్చు. ఋషీశ్వరుడే కావచ్చు. ఎవడూ మానవులకు కలిగిన ఈ సందేహాన్ని పోగొట్టలేడని నా నమ్మకం. ఛేత్తా నహ్యుప పద్యతే. ఇక్కడే ఉందొక రహస్యం. జీవిత మధ్యంలో వచ్చే సందేహా లెవరైనా తెలిసినవారు మనకన్నా గొప్పవారు తీరిస్తే తీర్చగలరేమో. కాని జీవితాంతంలో ఎదురయ్యే సమస్య పరిష్కరించే తాహతు ఒక్క భగవానుడికి తప్ప ఏ మానవుడికీ లేదు. ఋషిః దేవో వా అని వ్రాస్తున్నారు భాష్యకారులు. దేవతలూ ఋషులూ కూడా ఇక్కడ చేతు లెత్త వలసిందే. దేవతలకూ ఋషులకూ కూడా అంతు పట్టదు నా వ్యవహారమని తరువాత విశ్వరూపాధ్యాయంలో చెప్పబోతాడు కూడా.
కాబట్టి పరమాత్మ తత్త్వం పరమాత్మకే ఎరుక. జ్ఞాన క్రియా శక్తులు సమగ్రంగా ఉన్నవాడే పరమాత్మ అంటే. అలాటి సర్వజ్ఞుడు గనుకనే జననానికి పూర్వమూ మరణాని కనంతరమూ కూడా ఏమి జరుగుతుందో చెప్పగలడు. తానే చెప్పాడా మాట. తాన్యహం వేద సర్వాణి అని. అంతే కాదు. నత్వం వేస్థ అని కూడా చెప్పాడు. మానవుడికే
Page 529