#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

కాలమూ. కాని ఏమి చేస్తాం. కాలం తీరి వెళ్లిపోతున్నాడు. యోగా చ్చలిత మానసః - అవసాన కాలంలో ఎంత వాడికైనా మనసు చలించక తప్పదు గదా. అలాగే తెలివి తప్పింది వాడికి అప్పటికింకా సిద్ధి కలగ లేదనుకోండి. సిద్ధి అంటే ఇక్కడ యోగానికి ఫలమైన సమ్యగ్దర్శనం. ఆత్మజ్ఞానం. అది కలిగే లోపలనే వాడు కన్ను మూయవలసిన పరిస్థితి ఏర్పడిందనుకోండి. కాంగతిం కృష్ణ గచ్ఛతి. ఆ పరిస్థితిలో పోయిన ఆ యోగా భ్యాసికి పట్టే గతి ఏమిటో సెలవిస్తారా.

కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి || 38 ||

  అటు కర్మ మార్గానికీ ఇటు యోగమార్గానికీ రెంటికీ తప్పి గాలికి చెదిరిపోయిన మేఘంలాగా ఉభయ భ్రష్టుడయి పోతాడా వాడు. ఎందుకంటే అటు మామూలు నిత్యనైమిత్తి కాది కర్మలూ చేయటం లేదు వాడు. ఇటు ధ్యానయోగ మభ్యసించి దాని ఫలితమైన జ్ఞానమూ ఆర్జించ లేదు. మేఘంలాగా విరిసిపోక ఏమవుతుందా జీవితం. అప్రతిష్టో విమూఢ బ్రహ్మణః పధి. బ్రహ్మ ప్రాప్తి మార్గంలో ప్రతిష్ఠ పొందలేదు. మరణంలోనా తెలివి తప్పిపోయింది. ఇక ఉభయ భ్రష్టుడు కాక ఏమవుతాడు. అందుకే అడుగుతున్నాను. ఛిన్నా భ్ర మివ నశ్యతి. చెల్లా చెదరైన మబ్బులాగా విరిసి పోతుందా వాడి జీవితమని.

Page 528

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు