#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

సఫలమవుతుంది. ఇంతకూ మనస్సంయమాన్ని బట్టి ఉంటుంది మానవ జీవితానికి విజయం. మరి దేన్ని బట్టీ గాదు.

అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి || 37 ||

  అయితే ఇప్పుడొక ప్రశ్న వచ్చింది. అది భాష్యకారులే బయట పెడుతున్నారు. అర్జునుడు కేవలం నిమిత్తమాత్రుడే. అతడు వేస్తున్నాడని గాదీ ప్రశ్న. మనందరికీ కలిగేదే ఇది. అందుకే భాష్యకారులందరి తరఫునా వకాలతు పుచ్చుకొని తనకు తానే ప్రశ్నించుకొంటున్నారు. అదేమిటంటే యోగాభ్యాసంలో పడిపోయి ఇహలోక పరలోక ప్రాప్తికి నిమిత్తమైన కర్మలన్నీ సన్న్యసించాడు యోగి. యోగసిద్ధికి ఫలమైన మోక్షమా సమ్యగ్దర్శన మింకా పట్టుపడలేదు కాబట్టి అదీ ఆసించలేడు. ఇంతలోనే ప్రారబ్ధం తీరిపోయి మరణమనేది ముంచుకు వచ్చింది. అలాంటప్పుడిక అభ్యాసమనే దాని కాస్కారమేముంది. లేకుంటే మరణ కాలంలో బుద్ధి పనిచేయదు గదా ఇక వాడు మొదటి నుంచీ చేస్తూ వచ్చిన సాధన అంతా గంగపాలేనా. దానికి ఫలితమేలేదా అని ప్రశ్న.

  అదే అడుగుతున్నాడిప్పు డర్జునుడు కృష్ణ భగవానుణ్ణి. ఏమని. అయతిః శ్రద్ధయో పేతః యోగా చ్చలిత మానసః - యత్నం చేశాడింత వరకూ. ఎంతో శ్రద్ధగా ఆస్తిక్య బుద్ధితోనే బ్రతికాడు బతికినంత

Page 527

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు