ఆత్మసంయమ యోగము
భగవద్గీత
యోగమనేది ఎప్పటికీ ప్రాప్తించదు. అది అసంభవమని మేమతిః అభిప్రాయమంటాడు భగవానుడు. ఒక సంగీతమూ సాహిత్యమే నిరంతర సాధన లేకుండా నీకు పట్టు పడదు. భౌతికమైన విద్యలే నీకు సాధ్యం కావంటే ఇక అభౌతికమైన అధ్యాత్మ విద్య చెప్పేదేముంది. అది అన్నిటికన్నా దుర్లభం.
మరి ఎలా సులభమంటారు. వశ్యాత్మనాతు యతతా - ముందు చెప్పిన అభ్యాసాదులతో అంతకంతకు మనసు నీకు స్వాధీనమైతే మాత్రం శక్యో వాప్తు ముపాయతః - ఉపాయంతో పట్టుకోవచ్చు దాన్ని. దేన్ని. బ్రహ్మ జ్ఞానాన్ని. ఏదైనా మనస్సుకే. మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః అని పిచ్చి వాళ్లయి చెప్పారా. బంధంలో పడగొట్టిందీ మనసే. మళ్లీ పైకి లేపేదీ మనస్సే. రెండు శక్తులూ ఉన్నాయి దానికి. అందులో ఒక వైపే చూచామా నాణానికి మనమింత వరకూ. రెండో వైపు చూడక మరచి పోయాము. అదే అజ్ఞానం. దానికి తోడు ప్రయత్నం కూడా లేకపోతే ఏమవుతుంది. ఇక ఎప్పటికీ మన గతి ఇంతే. లేచే అవకాశమున్నా అది గుర్తించబోము. లేవలేము. అవకాశమేదో గాదు. మనసు నలాగే వదిలేయకుండా ఆ భావ ప్రవాహాన్ని మరలా ఆత్మాభిముఖంగా తిప్పటమే ప్రయత్నం. జల ప్రవాహం లాంటిది వృత్తి ప్రవాహం. ఎటు మళ్లిస్తే అటు వెళ్లి పోతుంది. పంట కాలువలు తీర్చి పొలాలకు నదీ జలాన్ని మళ్లించి నట్టు భావనదీ ప్రవాహాన్ని కూడా ఆత్మ వైపు మళ్లిస్తే జ్ఞానమనే పంట పండుతుంది. మోక్షమనే ధాన్యం చేతికి వస్తుంది. మానవ జీవితం
Page 526