#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

చేసుకోవాలి మనమిక్కడ. హైదరాబాదు వైపు వెళ్లట మభ్యాసమైతే విజయవాడ దూరం కావటం వైరాగ్యం. ప్రయాణం ప్రయాణమే. అవి రెండు ప్రయాణాలు కావు. ఒక్కటే ప్రయాణం. ఫలితాలు రెండు. ఏమిటది. హైదరాబాదు దగ్గర పడటమొక ఫలితం. విజయవాడ దూరం కావట మొక ఫలితం. రెండూ కలిసి గమ్యం చేరటమే అసలైన ముఖ్య ఫలం.

  నన్నడగితే అభ్యాస వైరాగ్యాలని రెండుచెప్పారే గాని ఒక్క అభ్యాసమే చాలు. అదే సాధన అసలు. వైరాగ్య మందులోనే కలిసి వస్తుంది. హైదరాబాదు వెళ్లుతుంటే విజయవాడ దూరంగాక ఏమవుతుంది. దూరం చేసుకోటానికి వేరే ప్రయత్నం చేయాలా. అక్కరలేదు గదా. అలాగే ఇక్కడా కర్మయోగం ద్వారా కొంత - ధ్యాన యోగం ద్వారా కొంత - ప్రయత్నం సాగిస్తూ పోతే అదే అభ్యాసం. జ్ఞానోదయాని కదే చాలు. అజ్ఞాన జన్యమైన అనాత్మ భావమిక అప్రయత్నంగానే దూరమయి పోతుంది సాధకుడి మనస్సుకు. మనస్సే బస్సిక్కడ. అది చేయవలసిన ప్రయాణ మాత్మ స్వరూప మందుకోటానికి. అనాత్మను దూరం చేసుకోటానికి గాదు. దాన్ని అందుకొంటూ పోతే ఇది దూరం కాక ఏమవుతుంది. అంతే కాదు. ఆత్మను పట్టుకోకుండా అనాత్మ ఎలా దూరమవుతుంది. ఆ కొమ్మ పట్టుకోకుండా ఈ కొమ్మనెలా వదిలేస్తావు. కిందబడే ప్రమాదముంది. అలాగే వైరాగ్యమదే పనిగా అవలంబించాలని కాషాయాలు కట్టుకొని పరుగెత్తనక్కర లేదు. అంతగా అయితే మరీ ప్రపంచ వ్యవహారాలలో తలదూర్చకుండా కొంతకు

Page 524

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు