#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || 35 ||

  భయ నివృత్తి చేస్తున్నాడిప్పుడు పరమాత్మ. జీవుడి కేర్పడే భయం పోగొట్ట వలసింది దేవుడే గదా. అభయ హస్తం వరద హస్తం. రెండే హస్తాలాయనకు. అభయం మోక్షానికీ వరదం భోగానికీ. భోగమోక్షాలు రెండూ ప్రసాదించవలసింది ఆయనగారేగదా. అప్పుడే మనకు ధైర్యం. ఉత్సాహం. అవి లేకుంటే ఏ మహా కార్యమూ సాధించలేడు మానవుడు. అన్నిటికన్నా మహత్తరమైన కార్యం మోక్ష పురుషార్ధం. అది ఆత్మజ్ఞానాధీనం. అది మనోవృత్త్యధీనం. ఆ మనసే మనకిప్పు డ ధీనం కావటం లేదు. ఎలాగా అని మధనపడుతుంటే హామీ ఇస్తున్నాడు భగవానుడు. అసంశయం. నీవు అడగటంలో తప్పు లేదు. మనో దుర్ని గ్రహం చలం. నీవన్నట్టు మనసనేది అరికట్టట మసాధ్యమే. అది చంచల మనటంలో సందేహం లేదు.

  కాని అసాధ్యమని చేతులు ముడుచుకొని కూచోరాదు. దానివల్ల నీవేదీ సాధించలేవు. ఎప్పటికీ సాధించలేవు. లోకంలో వన్నీ ఎలా మనసుతోనే అనుభవానికి తెచ్చుకొంటున్నావో పరమార్ధం కూడా అలాగే తెచ్చుకోగలవు. అభ్యాసేన తు కౌంతేయ - వైరాగ్యేణ చ గృహ్యతే అభ్యాసం వైరాగ్యం. ఇవి రెండే మార్గాలు మనసును నిగ్రహించటానికి. అందులో అభ్యాస మనులోమం. వైరాగ్యం ప్రతిలోమం. బస్సు ప్రయాణం గుర్తు

Page 523

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు