ఆత్మసంయమ యోగము
భగవద్గీత
సరే ఇప్పుడిక్కడ ప్రశ్న ఏమిటో చూద్దాం. అర్జునుడికీ బోధ అంతా విన్న తరువాత ఉన్నట్టుండి ఒక పెద్ద సందేహం వచ్చింది. ఏమిటది. యోయం యోగ స్త్వయా ప్రోక్తః సామ్యేన. సమదర్శనం. సమదర్శన మెక్కడ చూచినా జ్ఞానికి సమమైన బ్రహ్మమే కనిపిస్తుంటుందని జ్ఞానయోగాన్ని ఇంతగా ప్రశంసిస్తూ వచ్చారు మీరు. కాని ఇంత గొప్ప యోగం మాబోటి మానవులకు పట్టు పడుతుందా అని అనుమానం. ఏతస్యాహం నపశ్యామి స్థితిం స్థిరాం - ఇది మీరు మాకెంత బోధించినా మేము దానినెంత విన్నా వినటం వరకే గాని మనసులో బాగా హత్తుకొంటుందా స్థిరంగా నిలబడుతుందా అని నమ్మకం కలగటం లేదు నాకు. కారణమేమంటే మనసనేది మానవుడికి స్థిరంగా ఉండదు. చంచలత్వాత్. అతి చపలమైనది. పాదరసంలాగా చెదిరిపోతుంటుంది. నిలకడ లేదు. మరి మనసే గదా దేనికైనా సాధనం. ప్రపంచానుభవమైనా పరమాత్మాను భవమైనా కలగవలసింది దానికేగదా. అలాంటప్పుడింత చంచలమైన మనస్సుతో అచలమైన ఆత్మ తత్త్వాన్ని ఎలా పట్టుకోగలమని ప్రశ్న.
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ || 34 ||
ప్రయత్నిస్తే పట్టుకోవచ్చు గదా అనవచ్చు. ప్రయత్నమనేది సాధ్యమైతేనే చేయగలం గాని అసాధ్యమైన విషయంలో ఎవడూ చేయలేడు. ఏమిటా అసాధ్యమంటారా. చంచలం హి మనః - మర్కటం లాగా చపలమైనది
Page 521