#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ప్రస్తావనకు వస్తాయిక్కడ. అలా ప్రస్తావించాడంటే ఇవన్నీ వాస్తవంగా ఉన్నాయి. అవన్నీ వాస్తవంగానే కలుగుతాయని భ్రాంతి పడరాదు మరలా. వాస్తవంలో ఇవి ఏవీ లేవు. ఉన్నదొక్క ఆత్మ చైతన్యమే. దానికి భిన్నంగా అనాత్మ అంటూ ఏదీ లేదు. స్వర్గం లేదు. నరకం లేదు. జన్మలు లేవు. జన్మాంతరాలు లేవు. కాని వస్తుతంత్రంగా ఏవీ లేకపోయినా మానవుడలా భావించటం లేదు. బుద్ధి తంత్రంగా ఉన్నాయనే భావిస్తున్నాడు. కాబట్టి మానవుడి ద్వైత దృష్టిని బట్టి ఇవన్నీ చెప్పవలసి వచ్చింది మహర్షి. అసతోమా సద్గమయ అన్నట్టు ధర్మం ద్వారానే బ్రహ్మాన్ని పట్టుకోవాలి. ధర్మం సంకేతం. బ్రహ్మం సత్యం. సంకేత మెప్పుడూ తన పాటికి తాను సత్యం కాదు. సత్యాన్ని చూపటానికే ఉందది. అలాగే ఇప్పుడీ పుణ్యపాప కర్మలూ తత్ఫలితంగా లోకాంతరయానమూ జన్మాంతర ప్రాప్తి - ఇవన్నీ వ్యాసభగవానుడు వర్ణిస్తున్నాడంటే ఈ ప్రయోజనం కోసమే. ఏ ప్రయోజనం. సర్వమూ ఆత్మేననే జ్ఞాన ముదయించటం కోసం. ఇది కాదు ఇక్కడి కాగి పోకండి. చివరకు మోక్షమే పురుషార్ధమని మానవులకు గుర్తు చేయటం కోసం.

  అంతేకాదు. సాధకావస్థలోనే మరణిస్తే ఎప్పుడీ సాధనకిక అవకాశం. సిద్ధి లేకుండా సాధన కర్ధమేమిటి. అంచేత సాధన పూర్తి అయి సిద్ధి పొందాలంటే జన్మలుండి తీరాలి. ఒక జన్మతో సరిపోయే వ్యవహారం కాదు. అనేక జన్మ సంసిద్ధ స్తతో యాతి పరాంగతి మన్నట్టు సాధన

Page 519

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు