#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ || 33 ||

  ఇంతవరకూ జరిగిపోయిన భాగమొక ఎత్తు. ఇక మీదట ఈ అధ్యాయంలో జరగబోయే భాగమొక ఎత్తు. ఇంత వరకూ జరిగింది మోక్ష పురుషార్ధ వర్ణన అయితే ఇక మీదట రాబోయేది ధర్మ పురుషార్ధం. సర్వమూ ఆత్మేననే జ్ఞానం వల్లనే మోక్షం. అది మొదట కర్మయోగం వల్లా తరువాత ధ్యానయోగం వల్లా పరిపాకానికి వస్తే అలాటి జ్ఞానమే మోక్షాన్ని మనకు ప్రసాదిస్తుంది. అలాటి జ్ఞాని ఎవడో వాడి అనుభవమెలా ఉంటుందో అదీ ఇంతదాకా మనకు వర్ణించి చెప్పింది గీత. అదే యోగమని కూడా పేర్కొన్నది. యోగమంటే జ్ఞానయోగం. అది కర్మ ధ్యానయోగాభ్యాసం మూలంగా బలం పుంజుకొన్న యోగం. అప్పుడు వాణ్ణి జ్ఞాని అన్నా అనవచ్చు. యోగి అన్నా అనవచ్చు. లేదా జ్ఞానయోగి అనీ అనవచ్చు. వాడి వ్యవహారమింత దాకా వర్ణిస్తూ వచ్చింది గీత.

  పోతే ఇప్పుడలాంటి యోగాన్ని ఇంకా అందుకోలేని వాడూ అందుకోటమింకా పూర్తి కాకుండానే ప్రారబ్ధం తీరి కన్నుమూసిన వాడూ - ఇలాటి సాధకుల గతేమిటి అని ప్రశ్న వచ్చింది. దానికి సమాధాన మిస్తున్నాడిప్పుడు మహర్షి. ఇవ్వటంలో ఉన్నట్టుండి ధర్మ పురుషార్ధాన్ని పట్టుకు వస్తాడాయన. జన్మలూ జన్మాంతరాలూ లోకమూ లోకాంతరాలూ - ఆయా లోకాలలో వారికి గలిగే అనుభవాలూ - ఇవన్నీ

Page 518

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు