ఆత్మసంయమ యోగము
భగవద్గీత
చూస్తుంటావు. నీతో ముడిపెట్టుకొనే వాటి అస్తిత్వాన్ని చూస్తావుగాని నేననే భావం లేకుండా దేని అస్తిత్వాన్నీ నీవు గుర్తించటం లేదు. ఆ నేనే చిత్. ఆనా అస్తిత్వమే సత్. మాం భజతి అంటే అదే అర్ధం.
అలా సర్వత్రా సత్తా స్ఫూర్తులనే పట్టుకొని కూచున్నప్పు డదే మోక్షావస్థ. వాడి కన్యంగా ఏ భావమూ లేదుగా. ఇది మోక్షంగాక మరేమిటి. బంధం లేకపోవటమే మోక్షం. అన్యమే బంధిస్తుంది నిన్ను. అన్యమనే భావమే లేకుంటే అది ఇక మోక్షమే. అంచేత జీవన్ముక్తుడైన యోగి సర్వధా వర్తమానోపి. జీవితంలో ఎలాగైనా నడచుకోనివ్వండి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిష్రున్ అని ఇంతకు పూర్వమే వచ్చిందీ విషయం. వాడే పని చేస్తున్నా ఎలా ప్రవర్తిస్తున్నా సరే. ఏదో చేయటం లేదు. ఎలాగో ప్రవర్తించటం లేదు. వాడెక్కడో లేడు. వాడి శరీరంలో లేడు. వాడి గృహంలో లేడు. జన మధ్యంలో లేడు. జనాలతో వస్తు వాహనాలతో వ్యవహరించటమూ లేదు జ్ఞాని. మరెక్కడున్నాడు. సయోగీమయి వర్తతే. నాతోనే ఉన్నాడు. నాతోనే వ్యవహరిస్తున్నాడు. నాతో అంటే పరమాత్మతోనా కావచ్చు. పరమాత్మతోనైనా కావచ్చు. తన ఆత్మతోనైనా కావచ్చు. ఇన్ని ఆత్మలెక్కడ ఉన్నాయి. పరమాత్మ ఆత్మ తన ఆత్మే యోగికి. తన ఆత్మ పరమాత్మే. తేడా లేదు. అదే అనాత్మ ప్రపంచం కూడా వాడి దృష్టికి. ఆత్మా నాత్మలు రెండూ ఆత్మే. ముఖమూ ప్రతి ముఖమూ రెండూ ముఖమే వాటి స్వరూపం తెలిసిన వాడికి. తెలియని వాడికే ఇది నా ముఖం అది అద్దంలో
Page 513