#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

సర్వమూ సిద్ధించి నట్టే ఫలించినట్టే. సకల దుఃఖ నివృత్తి - సర్వసుఖప్రాప్తీ అన్నారు దాన్ని వేదాంతులు. అదే బ్రహ్మాత్మ భావం. ప్రత్యక్పర అనే తేడా లేకుండా రెండూ ఏకైకమైన ఆత్మ స్వరూపంగా అనుభవానికి రావటం. అదే మోక్షమనే అపవర్గం.

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః |
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే || 31 ||

  అద్వైతాత్మ భావం స్వానుభవానికి రావటమే మోక్షమని వర్ణించాము గదా. అది ఎలా ఉంటుంది దాని స్వరూపం. దైనందిన వ్యవహారంలో జ్ఞాని అయిన వాడెలా కనిపిస్తాడు. జీవన్ముక్తుడు గదా వాడు. లోకంతో వ్యవహరిస్తూనే వాడు ముక్తుడని ఎలా అనిపించుకొంటాడని ప్రశ్న. దానికి సమాధానమిస్తున్నాడు. వేదవ్యాసుడు.

  వాడి స్వానుభవమెలా ఉంటుందని అడిగావా భజత్యేకత్వ మాస్థితః ఏకత్వమే చూస్తుంటాడెప్పుడూ. ఎక్కడ ఉందా ఏకైకమైన తత్త్వం. మాం. అహంతా రూపంగా Subjective ఉందది. నేను నేననే స్ఫురణ సర్వత్రా వ్యాపించి ఉంది. సర్వత్రా అంటే ఎక్కడని. సర్వభూత స్థితం. సమస్త పదార్ధాలలో సత్తా రూపంగా Existance వ్యాపించి ఉంది. చరాచర పదార్ధాలు ప్రతి ఒక్కటీ లోకంలో అయం ఘటోస్తి అయం పటోస్తి అయం వృక్షోస్తి - అయం మృగోస్తి - అయం మనుష్యోస్తి - అని ఉంది ఉందనే స్ఫురిస్తుంటుంది నీకు. అలా స్ఫురించేటప్పుడు నాకు స్ఫురిస్తుందనే

Page 512

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు