#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  పోతే అలా వ్యాపించే శక్తి ఉన్నదొక్కటే. అది ఆత్మ. వీటి లాగా విశేషం Particular కాదది సామాన్యం Universal. అంటే అర్ధం. వీటిలో ప్రతి ఒక్కదానినీ సమానంగా వ్యాపించేదని అర్థం. వ్యాపించటమంటే వాటి వెలపలే గాదు. లోపల గూడా. లోపలే గాదు. స్వరూపం కూడా. వాటి ప్రతి అణువూ కూడా. అదీ స్వరూపమంటే. ఎలా వ్యాపించ గలదు. సచ్చిద్రూప మాత్మ అంటే. సత్తంటే ఉండటం. చిత్తంటే స్ఫురించటం. ఉందనే స్ఫురణే ఆత్మ. అది నిరాకారం. నిరాకారమైన ఆకాశంలాగా జడం గాదు. స్ఫురణ Consciouness కాబట్టి చేతనం. తానున్నట్టు తనకు తెలుస్తుంటుంది. అలాంటిది గనుకనే సర్వ వ్యాపకం. వ్యాపకమంటే చెప్పాము గదా లోపల వెలపలా మాత్రమే గాక స్వరూపం కూడానని.

  అలాంటప్పుడిక భూతాలెక్కడ ఉన్నాయి. అందులోనే ఉండాలి. మరెక్కడా గాదు. అది ఎక్కడ ఉండాలి. వాటిలోనే. తరంగంలో జలమూ. జలంలో తరంగమూ. అదే సర్వభూతస్థ మాత్మానం - సర్వభూతాని చాత్మని అనే మాటల కర్ధం. సర్వ పదార్ధాలలో ఆత్మే. ఆత్మలోనే పదార్థాలు. అప్పుడే మయింది. ఆత్మే ఆధారం. ఆత్మే ఆధేయ మయింది Both Container and contained. అదే ఆధారమదే ఆధేయమయి నప్పుడదే ఉంది మరేదీ లేదని అర్ధం. జలమే తరంగాని కాధారమయి తరంగంలో కూడా ఆధేయంగా జలముందంటే ఏమిటర్ధం. జలమే ఉంది గాని తరంగాదులు లేవని గదా. అలాగే ఆత్మే ఉందిగాని అనాత్మ ప్రపంచం దానికి భిన్నంగా లేదని చెప్పినట్టయింది.

Page 507

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు