#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

చీకటిలాగా లయమయి పోతాయవి. వాటి ఆసరా లేకపోతే మనః ప్రాణేంద్రియాలిక ఆత్మాకారంగానే దర్శనమిస్తాయి. కల్మషమనే గంధం కూడా ఉండదిక.

  అంతేకాదు. అది లేకపోవటం ప్రతిలోమ సిద్ధి అయితే అనులోమంగా యోగి అత్యంతం సుఖమశ్నుతే - అంతం లేని అనంతమైన బ్రహ్మానందాన్నే అనుభవించ గలడు. ఏమిటది. ఎలాగ. బ్రహ్మ సంస్పర్శమ్. బ్రహ్మంతోనే స్పర్శ ఏర్పడుతుంది వాడి బుద్ధికి. అపరోక్షంగానే బ్రహ్మం వాడి బుద్ధికి సోకుతుంది. సాక్షాత్కరిస్తుంది. అది కూడా సుఖేన - దాని పాటికది అనాయాసంగా. అంతవరకూ దానికోసం ఎంతో దీక్షతో సాధన చేసి ఉన్నాడు. ఆ సాధనకు ఫలిత మేర్పడేటప్పు డవ లీలగా అతి సుఖంగా ఏర్పడుతుంది. ఏర్పడిందో అప్పుడు యోగి మనస్సు మనస్సే గాదు. అది ఆత్మ లేదా బ్రహ్మం. వాడికి కలిగే సుఖం కూడా సాతిశయం Relative కాదు. నిరతిశయం.

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || 29 ||

  అయితే నిరతి శయమైన ఆ బ్రహ్మానందాన్ని అతడెలా అనుభవిస్తాడు. అలా అనుభవించేటప్పు డతనికీ లోకమేమయి పోతుంది. ఇది వాడికి కనిపిస్తుందా లేదా. కనిపిస్తుందంటే అది ద్వైతం. కనిపించదంటే అది అనుభవ విరుద్ధం. ఎందుకంటే వాడికింకా ఉపాధి ఉంది. ఉపాధి ఉందంటే

Page 505

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు