#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

లభిస్తుంది. ఏమిటి. సుఖ ముత్తమమ్. ఉత్తమమైన సుఖం. ఉత్తమమంటే నిరతి శయ మని భాష్యం. దేనికన్నా ఇక అధికమైన సుఖం లేదో అది. అంటే బ్రహ్మానందం. వాడు బ్రహ్మ భూతుడు గదా. కాబట్టి వాడికి లభించేది కూడా బ్రహ్మానందమే Bliss.

యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ విగతకల్మషః |
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే || 28 ||

  ఈవిధంగా యోగారూఢూడికి కలిగే సిద్ధిని వర్ణించి మరలా వాడు దానికోసం చేయవలసిన సాధనా సిద్ధీ రెండూ కలిపి వర్ణిస్తున్నాడు వ్యాస భగవానుడు. యుంజన్నేవం సదాత్మానం. మనసు నెప్పుడూ పట్టిన పట్టు విడవకుండా యోగమార్గంలో నడుపుతూ పోవాలి. మార్గంలో ఎన్నో అంతరాయాలు పిలిస్తే పలుకుతుంటాయి. ప్రమాదాలస్యాది యోగ విఘ్నాలు చాలా వర్ణించారు యోగశాస్త్రంలో. అలాటివన్నీ అభ్యాస బలంతో దాటిపోవాలి యోగి. ఈశ్వరానుగ్రహం కూడా దానికి తోడయితే తప్పకుండా చిత్తేంద్రియాలకు పట్టిన మాలిన్యమంతా క్షాళితమయి పోతుంది. విగత కల్మషః - నిష్కల్మషు డవుతాడు. గుణకాలుష్యమే కాలుష్యం మానవుడికి. సత్త్వరజస్తమస్సులే గుణాలు. సత్త్వం మనస్సూ - రజస్సు ప్రాణమూ - తమస్సు శరీరమూ నని గదా పేర్కొన్నాము. అవి అంటి పెట్టుకొని ఉండటం వల్లనే మనసు మొదలు శరీరం వరకూ దెబ్బతిన్నాయి. వాటిని నిర్విశేషంగా చూడగలిగితే సామాన్య జ్ఞానమనే వెలుగులో

Page 504

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు