సాంఖ్య యోగము
భగవద్గీత
చేసి వస్తున్నాము. ఇది ఈ కనిపించే దేహమే ఆత్మ అనుకోటం వల్ల వచ్చిన పొరబాటు. ఆ దేహం కదులుతూ మెదులుతూ ఉంటే బ్రతికి ఉన్నాడంటారు. కదలకుండా పడిపోతే చనిపోయాడంటారు. అప్పటికి చలించే దేహమే ఆత్మ. దీనికే దేహాత్మ వాదమని పేరు. ఇది లోకులందరికీ ఉంది ఈ దృష్టి. పోతే చాలామంది శాస్త్రజ్ఞులకూ Scientists ఉంది.
ఇదిగాక ఇంకొక దృష్టి కూడా ఉంది కొంతమందికి. వారు లోకులలోనే ఆస్తికులు. శాస్త్రజ్ఞులలో మీమాంసకులు. వారిది జీవాత్మ వాదం. శరీరమే కాదు ఆత్మ. అంతకు మించి జీవపదార్థ మొకటి ఉంది ఈ శరీరంలో. స్థూలమైన శరీరమే ఇక్కడ దగ్ధమై పోతున్నది. ఇది చని పోయినా అది పోదు. మరణ సమయంలో దీన్ని వదిలేసి అది బయటికి వస్తుంది. దానికే సూక్ష్మ శరీరం లేదా లింగ శరీర Subtle Body మని పేరు. ఏదో గాదది. మనలో ఇప్పుడున్న మనస్సూ ప్రాణమే. ప్రారబ్ధం తీరితే అవి ఈ స్థూల శరీరంలో పనిచేయవు. కనుకనే ఇది నిశ్చేష్టమయింది. కాని అవి మాత్రం నిశ్చేష్టం కావు. మనసు దారి చూపుతూ ఉంటే ప్రాణం కదిలి లోకాంతరాలకు పోతుంది. అందులో ప్రాణం ద్వారా కర్త మనసు ద్వారా భోక్త అవుతున్న ఒకానొక చైతన్య శకలమే జీవుడు. వీడు పుణ్యం చేసుకొని స్వర్గానికి పాపం చేసి నరకానికి వెళ్లి అక్కడ ఆయా సుఖదుఃఖా లను భవించి మరలా కర్మశేషంతో ఈ కర్మ భూమిలో ఇంకొక శరీరం ధరించి జన్మిస్తాడు. ఇలా కర్మ జన్మకూ జన్మ కర్మకూ దారి తీయటం
Page 50