#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

సూచిస్తున్నాడు మహర్షి దుఃఖ సంయోగం విషాదమైతే - దుఃఖ వియోగం సాంఖ్యం. ఇంతకన్నా చెప్పవలసిందే ముంది. శాస్త్రార్ధమంతా ఒక ముక్కలో కలిసి వచ్చింది.

  ఎటు వచ్చీ అలాటి ఆరూఢ స్థితి నందుకోటానికి కావలసిన కృషి చేయటమే మానవుడి కర్తవ్యం. కృషి చేస్తూ పోయే వాడా రురుక్షువు. చేసి దాని ఫలితం పొందిన వాడారూఢుడు. ఫలితం కావాలంటే ప్రయత్నం చేయక తప్పదు. కాబట్టి ఫలితాన్ని వర్ణించామంటే అప్పుడే అది వచ్చి ఒళ్లో బడిందని సంతోషించ రాదు. ప్రయత్నం చేస్తూ పోవాలి కొంతకాలం. అందుకే అంటున్నారు గురువుగారు. యోగఫల ముప సంహృత్య పునరన్వారంభేణ యోగస్య కర్తవ్యతా ఉచ్యతే. యోగఫలం చెప్పి ముగించి మరలా మొదటికి వచ్చి యోగమెలా చేయాలో వర్ణిస్తున్నారట.

  ఎలా చేయాలట యోగం. సనిశ్చయేన యోక్తవ్యః యోగః అనిర్విజ్ఞేన చేతసా. నిశ్చయమూ అనిర్వేదమూ - ఇవి రెండూ నియమంగా ఉండి తీరాలి యోగ మభ్యసించేటప్పుడు. నిశ్చయమంటే ఇది ఇంతే ఇలాగే చేయాలి యోగం దీనికి తప్పకుండా సత్ఫలితముంది అనే అధ్యవసాయమే నిశ్చయం Conviction faith. నిశ్చయం లేక ఫలితముందా లేదా అని సందేహిస్తూ పోతే అడుగు ముందుకు వేయలేవు. ముందుగానే నీరుగారి పోతావు. ఇక యోగమేమిటి. అభ్యాసమేమిటి. వట్టి మాట.

Page 497

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు