ఆత్మసంయమ యోగము
భగవద్గీత
లక్షణాలుండి తీరాలని - మనమెలా చెప్పుకొన్నా చెప్పుకోవచ్చు నని వ్యాస హృదయం.
అందుకే ఒక షరతు పెట్టాడాయన. ఏమిటా షరతు. తం విద్యా ద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం - అదే మీరు యోగమని తెలుసుకోండి - మరేదీ గాదు. అదేనట. ఏదది. ఎలాంటిది. దుఃఖ సంయోగ వియోగం. వియోగమే వాస్తవంలో యోగం. యోగమంటే ఉండటం. వియోగమంటే లేకపోవటం. ఒకటి లేకుండా పోవటమే మరొకటి ఉండటం. దుఃఖం లేకపోవటమే యోగమట. అంటే సంసార తాపత్రయం పూర్తిగా తొలగిపోతే అది వియోగం. ఆ వియోగమే యోగం. దీనిని విపరీత లక్షణమని పేర్కొన్నారు భగవత్పాదులు. Two negatives make a positive. దుఃఖముంటే అది సుఖమెలా అవుతుంది. సుఖం లేకుంటే అది యోగమెలా అవుతుంది. సుఖమా త్యంతిక మని గదా వర్ణించాడు. కాబట్టి దుఃఖంతో వియోగమే సుఖంతో యోగం. ప్రస్తుతం మనకున్నది దుఃఖంతో యోగం. సుఖంతో వియోగం. దీనికి భిన్నంగా సుఖంతో యోగం. దుః ఖంతో వియోగ మేర్పడాలి. అదే ప్రస్తుతం యోగమనే మాట కర్ధం.
గీతా శాస్త్రార్ధమంతా ఇక్కడే మనకు సాక్షాత్కరిస్తున్నది. జీవిత సమస్యా - దానికి పరిష్కారాన్వేషణా - ఇదే గదా శాస్త్రార్ధం. అందులో విషాదయోగం సమస్య అయితే - సాంఖ్యయోగం దానికి పరిష్కారమని చెప్పామా లేదా. దానినే ఇక్కడ ఒక మాటలో ఒక చిన్న సమాసంలో
Page 496