#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

మరొక టేదో ఉందని భావించడట వాడు. లోకంలో అయితే ఎన్నో ఉంటాయి మనమాసించే లాభాలు. అది కావాలిది కావాలనే గదా ఎప్పుడూ మన తాపత్రయం. అవి మన మాశ పడ్డట్టు మనకు ప్రాప్తిస్తాయని చెప్పలేము. కొన్ని లభిస్తే కొన్ని లభించవు. అన్నీ లభిస్తే గాని తృప్తి లేదు. అన్నీ అంటే ఎన్నని. అసంఖ్యాకం. అంతూ పంతూ లేదు వాటికి. కారణం. విశేషాల పుట్ట ఈ ప్రపంచం. మనసులో కలిగే కోరికలూ అలాటి విశేషాలే. రెండూ అసంఖ్యాక మనంత మయినప్పు డెన్ని లభించినా ఏమి సుఖం. అంతం లేదుగా లాభానికి.

  లాభాని కంత మెప్పుడు. ఇక లభించ వలసిందేదీ లేనప్పుడు. ఎప్పుడది లేకపోతుంది. విశేషంగా కనపడ నప్పుడు. విశేషాలన్నీ కలిసి సామాన్యాకారంగా భాసించి నప్పుడది ఇక అనాత్మ కాదు. ఆత్మ స్వరూపం. అదే విశేషాలన్నింటినీ తనలో లయం చేసుకొని నిర్విశేషంగా దర్శనమిస్తుంది. ఇస్తే అదే ఏకైకమైన లాభం. ఇక వేరే లాభమేముంది. వేరనే ప్రశ్నే లేదు గదా. ఎందుకు. వేరుగా కనిపించేవి విశేషాలే. అవన్నీ లయమయి పోయాయి సామాన్యంలో. సామాన్యమే ఆత్మ. విశేషాలే అనాత్మ. కాబట్టి ఆత్మ ఒకటి లభిస్తే చాలు. అన్నీ మనకు లభించినట్టే. ఇక ఏ లాభమూ మనకక్కర లేదు. ఏదైనా మిగిలిపోతే గదా అది లాభమను కోటానికి. అన్నీ ఆత్మలోనే కలిసి వచ్చాయి. కాబట్టి అదే పరమ లాభం మన పాలిటికి. దాన్ని మించిన లాభమంటూ లేదని అనాత్మ దృష్టిని కొట్టివేస్తున్నదీ వాక్యం.

Page 494

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు