#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  ఆత్మాకారం. అఖండాకారం. అఖండమైన ఆత్మ ఎలా ఉందో అలా ఏర్పడే వృత్తి. అది లోకులకూ కర్మిష్ఠులకూ తత్త ద్దేవతో పాసకులకూ అంతుపట్టేది. కాదు. కేవలమాత్మనే లక్ష్యంగా పెట్టుకొని దానికోస మభ్యాసం చేసి అందులో ఆరూఢులైన సాధకులకే లభిస్తుంది. దాని బలంతో దర్శిస్తారు అనుభవిస్తారు వారు అవిషయజనితమైన ఆత్మానందం. ఆత్మలోనే ఉండి ఆత్మ సుఖ మనుభవిస్తుంటారు కాబట్టి యత్ర నచైవాయం స్థిత శ్చలతి తత్త్వతః - తత్వం నుంచి జారిపడటమంటూ ఉండబోదు వాడికి. అలా స్థిరంగా తన స్వరూపంలో తాను నిలదొక్కు కొన్నప్పుడే వాడు యోగా రూఢుడు. స్థిరత్వ మేర్పడుతుంది. మనసూ ఇంద్రియాలూ ఇటూ అటూ లాగకుండా ఉన్నప్పుడు. అవి ఎప్పుడుంటా యలాగా. నీవు వాటిని నీ చెప్పుచేతల్లో ఉంచుకొన్నప్పుడు. అది ఎలాగా. నీవాత్మాభిముఖంగా నిరంతరమూ యోగమనే వాహనంలో కూచొని నిర్విరామంగా ప్రయాణం సాగించినప్పుడు. అప్పుడే నీవు నీ స్వరూపమనే గమ్యం చేరగలవు. ఆత్యంతికమైన సుఖ మనుభవించగలవు.

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే || 22 ||

  అత్యంత సుఖానుభవమే గాక మరి రెండు సత్యాలు కూడా సెలవిస్తున్నాడు మనకు గీతాచార్యుడు. అవేమిటంటే యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః అంతకన్నా గొప్ప లాభం జీవితానికి

Page 493

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు