ఆత్మసంయమ యోగము
భగవద్గీత
అనంతం గదా. కనుక తజ్జన్యమైన సుఖానుభవం కూడా అనంతమే కావలసి ఉంది. అదే ఆత్యంతికమంటే. అంత మతీత్య వర్తతే ఇతి అత్యంతికం Endless Eternal.
కాని ఎలా అందుకోవాలా సుఖం. బుద్ధి గ్రాహ్యమతీంద్రియ మన్నారు. బుద్ధితోనే అందుకోవాలది. ఇంద్రియాలతో గాదు. చక్షురాదీంద్రియాల కగోచరమది. ఇంద్రియ గోచరమైన సుఖమెప్పుడూ సాంతమే. అనంతం కాదు. ఇంద్రియవృత్తులే సాంతమైనప్పుడవి సాధించే సుఖ మనంతమెలా కాగలదు. పోతే అంతరింద్రియైన మనసు కూడా పనికిరాదు. మనసంటే సంకల్ప వికల్పాత్మకం. ఏది ఆలోచిస్తుంటే ఆ మేరకది పరిచ్ఛిన్న Limited మయిపోతుంది. ఆలోచనకు వచ్చేదీ పరిమితమే. తద్విషయమైన ఆలోచనా పరిమితమే. దీనినే వృత్తి జ్ఞాన Idea మంటారు వేదాంతులు.
కనుక బహిరింద్రియాలూ కావు. అంతరింద్రియమైన మనసూ కాదు సాధనం. అయితే మరేది సాధనం. ఒక్క బుద్ధే. బుద్ధి అంటే ఏమిటది. ఇంద్రియ నిరపేక్షమని అర్థం చెబుతున్నారు భగవత్పాదులు. ఇంద్రియాల అవసరం లేనిదది. చక్షురాదుల దగ్గరి నుంచీ అంతరింద్రియమైన మనస్సు వరకూ అన్నీ ఇంద్రియాలే. అవన్నీ 25 : Particulars corresponding to particular things. బుద్ధి అలాంటిది కాదు. అదీ వృత్తే అయినా నిర్విశేషమైన వృత్తి నిర్వికల్పమైన వృత్తి. విశేష జ్ఞానం కాదది. సామాన్యాకారమైన జ్ఞానం.
Page 492