#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

కనుక ఎక్కడ చూచినా చూడవచ్చు. ఎక్కడ చూస్తే అక్కడే ఆత్మ. అందుకే పశ్యన్నాత్మని. ఆత్మలోనే చూడవచ్చు. ఆత్మలో ఆత్మను ఆత్మతోనే పట్టుకోమని చెబుతున్నది గీత. అప్పుడే తుష్యతి. తృప్తి కలుగుతుంది. అది అంతటా ఉన్న పదార్ధం గనుకనే పట్టుకొనే నీవూ అదే పట్టు పడేదీ అదే పట్టుకొనే సాధనమూ అదే. ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలు మూడూ నీ స్వరూపమే అయినప్పుడిక క్రొత్తగా పట్టుకొనే ప్రయత్నమేముంది. అవసరమేముంది. కేవల మీ సత్యాన్ని గుర్తు చేసుకోటమే గ్రహించట మనుభవించటం. అదే తృప్తి మానవుడికి. ప్రతి మానవుడికీ గాదు. ప్రతివాడూ ఈ సూక్ష్మాన్ని గుర్తించ లేడు గదా. అలా గుర్తించే సూక్ష్మ బుద్ధి గలవాడెవడో వాణ్ణి యోగి అంటున్నది గీత.

సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః || 21 ||

  యోగ సిద్ధుడైన వాడేది గుర్తిస్తాడది ఎలా గుర్తిస్తాడని అడిగితే దానికి జవాబిస్తున్నది గీత. సుఖమాత్యంతికం యత్ తత్ వేత్తి - వేత్తి అంటే గుర్తించటం. గుర్తించటమే కాదు వేత్తి అనే మాటకు దర్శనం అనుభవమని కూడా అర్ధమే. దేన్ని గుర్తిస్తాడు యోగి దేన్ని అనుభవిస్తాడు. సుఖమాత్యంతికం – అనంతమైన సుఖాన్ని. సాంతమైన సుఖమైతే లోకులే అనుభవిస్తున్నారు. అందులో విశేషమేమీ లేదు. యోగాభ్యాసమే చేయనక్కర లేదు దానికోసమే అయితే. మరి ఇంత యోగాభ్యాసం చేసి పొందే సుఖమలా సాంతమైతే ఎలా. అనంతమైన సుఖమైతేనే గొప్ప. వాడందు కొన్న పరమాత్మ

Page 491

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు