#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

రెండూ మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి కూడా ఉంటాయి. ఎక్కువ ఆహారం తీసుకొంటే బద్ధకిస్తాము. నిద్ర వస్తుంది. అసలే మానేస్తే శరీరం నీరసించి అసలు యోగాభ్యాసాని కుత్సాహమే చూపలేడు సాధకుడు. కనుక అన్ని విషయాలలో మితంగా నడుచుకోట మెంతైనా మంచిది. శరీర మాద్యం ఖలు ధర్మ సాధన మన్నారు. శరీరం మాట వినకపోతే మనసు వినదు. మనసు వినకుంటే అసలే పనీ చేయలేము. భగవద్గీతా సర్వస్వము

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా || 17 ||

  అంచేత ఆహారవిహారాదుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రతిలోమంగా నడుచుకొంటే కలిగే నష్టమేదో చెప్పి ప్రస్తుత మదే అనులోమంగా సేవిస్తే కలిగే లాభం వర్ణించి చెబుతున్నాడు. నష్టం యోగానికి నోచుకోక పోవటమైతే లాభం యోగమనేది నిర్విఘ్నంగా సాగి ఫలించటం. అది ఎలాగ. యుక్తాహార విహారస్య - యుక్తంగా ఉండా లాహారంలో గాని విహారంలో గాని. యుక్తమంటే నియమబద్ధం. ఎంతో అంత. ఎంత ఆహారమో అంతే సేవించాలి. ఎంత సంచారమో అంతే చేయాలి. రాత్రే శతపదం గచ్చేత్ - రాత్రి భోజనానంతరం వెంటనే పడుకోకుండా నూరడుగులు నడచి రమ్మన్నారు. అలాగే దివా విశ్రాంతి మాప్నుయాత్. పగలు భుజించిన తరువాత ఒకటి రెండు గంటలు పడుకోమన్నారు.

Page 483

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు