#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ఏకరువు పెడుతుంది. నాత్యశ్నతస్తు యోగోస్తి యోగం నీకు ఫలిత మివ్వాలంటే అతిగా భోజనం చేసినా ఇవ్వదు. నచైకాంత మనశ్నతః అలాగని అసలే ఆహారం తినటం మానేసినా ఇవ్వదు. రెండూ అతి చేష్టలే. నిరాహారం పనికి రాదు. అధికాహారం పనికిరాదు. ఆహారం తీసుకోవలసిందే యోగి. కాని మితంగా హితంగా తీసుకోవాలి. ఆకలి తీరటాని కెంతో అంతే. అదీ సాత్త్వికంగా ఉండాలి ఆ ఆహారం.

  అసలు యోగశాస్త్రంలోనే చెప్పారు యోగసాధకు డెంత మాత్ర మాహారం సేవించాలో. అర్ధం సవ్యం జనాన్నస్య - తృతీయ ముదకస్యచ - వాయోస్సంచారణార్ధంతు - చతుర్ధ మవశేషయేత్. జఠరాశయాన్ని నాలుగు భాగాలుగా భావించి అందులో రెండు వంతులు మాత్రమే ఘనపదార్ధంతో నింపుకోవాలి. మూడోవంతు నీళ్లతో నింపాలి. పోతే నాలుగోవంతు అలాగే ఖాళీగా వదిలేయాలట ఎందుకు. గాలి ఆడటాని కంటారు యోగులు. కనుక ఆత్మ సమ్మితమైన దానికంటే ఎక్కువ మోతాదు పనికిరా దాహారం. అప్పుడే తేలికగా ఉంటుంది శరీరం. చురుకుగా కూడా పనిచేస్తుంది.

  అంతే కాదు. ఆహార విషయంలోనే కాక నిద్ర కూడా అతిగా పోరాదు. అలాగని అతిగా మేలుకొనీ కూచోరాదు. నచాతిస్వప్న శీలస్య - జాగ్రతో నైవ అని నిద్రా జాగ్రత్తులకు సీలింగు పెడుతున్నది గీత. అతిగా నిద్రిస్తే మొద్దుబారి పోతుంది మనస్సు. యోగసాధనకు పనికిరాదు. అలాగే అసలే నిద్ర పోకుంటే విశ్రాంతి ఎఱగక బద్ధకిస్తుంది సాధన చేయటానికి. అసలివి

Page 482

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు