#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  అది ఏదోగాదు. అంతా ఇంతా గాదా ఫలం. మహాఫలమది. ఏమిటది. శాంతిం నిర్వాణ పరమాం. నిర్వాణమంటే మోక్షమని వ్రాస్తున్నారు గురువుగారు. మోక్షమే చివరి మెట్టు. అది నిర్వాణ పరమాం. దేనికి చివర. శాంతిం శాంతికి. వాడికి కలిగే శాంతి ఎలాంటి శాంతి అంటే మోక్షమే దానికి పర్యవసానం. అంతకన్నా గొప్ప శాంతి లేదు. అన్ని వ్యాపారాలూ వ్యవహారాలూ అక్కడి కాగిపోవలసిందే. ఇక కోరవలసిందేదీ లేదు. ఇక ఆగక ఏమవుతాయి. అయితే ఎక్కడ ఉందా శాంతి. ఎవరిస్తారు. అది బాహ్య జగత్తులో లేదు. అనాత్మ ప్రపంచానికి చెందినది కాదు. ఎంచేత. అనాత్మ అంతా ఆత్మ తాలూకు ఆ భాసే. అది వస్తువుగాదు. ఆత్మే వస్తువు Reality. అది ఇప్పుడు నీదగ్గరే ఉన్నా అనాత్మ భూతమైన దేహేంద్రియాదులతో కలిసి కలుషితమై సంకుచితమై ఉంది. కనుకనే నిర్వాణ పరమమైన శాంతి లేదు. అసలైన శాంతి కావాలంటే ఈ కలుషితమైన తగ్గిపోయిన ఆత్మ పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఆత్మను పట్టుకోవాలి. ఇది జీవాత్మ అయితే అది పరమాత్మ. మత్సంస్థా మధిగచ్ఛతి నాకు సహజమైన శాంతినే యోగి పొందగల డంటున్నాడు. పరమాత్మకు సహజమా శాంతి. జీవాత్మకు కాదా అని అడగవచ్చు. వీడికీ సహజమే. రెండాత్మలు లేవు. ఉన్నదొకే ఆత్మ. ఒకే ఆత్మ అయినప్పుడు సహజమేమిటి. అసహజమేమిటి. వాస్తవమే. కాని సహజమైనా ఉపాధులతోడి సాంగత్యం వల్ల అశాంతి పాలయింది. ఉపాధులు కూడా అజ్ఞానం వల్లనే.

Page 480

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు