#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

ఏమిటో ఎలాటిదో ముందుగా పేర్కొన్నది గీత. అలా పేర్కొని దానికిపుడు పరిష్కార మేమిటో వర్ణించి చెబుతున్నాడు పరమాత్మ. ఏమిటా పరిష్కారం. అది ఇప్పుడీ సాంఖ్యయోగం నుంచీ శ్రద్ధాత్రయం దాకా 16 అధ్యాయాలలో బయట పెడుతుంది గీత.

  సాంఖ్యమంటే సంఖ్యానం. ఇది ఇంత అది అంత అని విభజించి చూపటం. సమ్యక్ ఖ్యాయతే ఆత్మ తత్త్వమితి సాంఖ్యమని కూడా అర్ధం చెప్పవచ్చు. ఆత్మ అంటే ఏమిటో దాని జ్ఞానం మనకందించే దని కూడా అర్ధమే. ఆత్మజ్ఞానం లేనంతవరకూ ఈ శరీరమే ఆత్మ అని మిగతా ప్రపంచమంతా ఆత్మ కాదు అనాత్మ అని ద్వైత దృష్టితో చూస్తుంటాడు ప్రతివాడూ. అలా చూస్తున్నంతవరకూ సంసార బంధం తప్పదు మానవుడికి. అది తప్పిపోవాలంటే ఆత్మ అంటే ఏమిటో దాని జ్ఞానం సంపాదించ వలసిందే. అందుకే ఈ సంఖ్యానం. భగవత్పాదులు కూడా ఇది మనసులో పెట్టుకొనే ఇలా వ్రాస్తున్నారు దీని కవతారిక. మహతి శోక సాగరే నిమగ్నస్య అర్జునస్య ఆత్మజ్ఞానా దన్య త్రోద్ధరణ మపశ్యన్ భగవాంస్త ముద్దిధారయిషుః ఆత్మ జ్ఞానాయా వతారయన్నని.

  జ్ఞానం లేకపోవటం వల్లనే శోకం మానవుడికి. కో మోహఃకః శ్శోకః ఏకత్వ మనుపశ్యతః అని చాటుతున్న దీశావాస్యం. అంతా ఆత్మ అని చూచేవాడికి మోహ మెక్కడిది. శోక మెక్కడిది. మోహమంటే అజ్ఞానమే గదా. ఆ బాలగోపాలమూ మనకన్ని రకాలైన జ్ఞానాలూ ఉన్నాయి.

Page 48

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు