సాంఖ్య యోగము
భగవద్గీత
2. సాంఖ్య యోగము
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 11 ||
విషాదయోగం సమాప్త మయింది. పోతే ఇప్పుడు మనం రెండవదైన సాంఖ్యయోగంలో ప్రవేశించాము. సాంఖ్యంలో కూడా 10 శ్లోకాలున్నాయి. ఇది 11 వ శ్లోకం. కాని గీతాశాస్త్రంలో ఇదే మొదటి శ్లోకం. ఉపదేశంతో గదా శాస్త్రమనేది ప్రారంభ మవుతుందని చెప్పాము. ఉపదేశ మనేది ఇక్కడి నుంచే. ఇంతవరకూ నడచిందంతా కధా భాగమూ అర్జున విషాదమూ. విషాదం మనకను భవ సిద్ధమే. అందులో శాస్త్రానికి ప్రమేయం లేదు. అయితే సమస్య లేనిదే ఉపదేశించే అవసరం రాదు కాబట్టి అది
Page 47