ఆత్మసంయమ యోగము
భగవద్గీత
సమంకాయ శిరోగ్రీవం ధారయన్ - శరీరమూ శిరస్సూ మెడా మూడూ సమంగా ఉంచుకోవాలట. సమంగా అంటే చక్కగా ఒక రేఖాకారంగా Straight నిలుపుకోవాలి. అది కూడా అచలం స్థిరః తాను స్థిరంగా ఉండి అవి చలించకుండా చూచుకోవాలి. ఎందుకంటే మూడూ సమానంగా నిలుపుకొన్నప్పుడు శరీరానికి చలనమనేది కలగవచ్చు. అందుకే చలించకుండా అచలంగా ఉంచుకోమని చెప్పటం.
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం అలా శరీరాదులు నిశ్చలంగా నిలిచి ఉన్న తరువాత చెబుతున్నాడు. ఏమని. సాధకుడు తన నాసికాగ్రం మీద చూపు నిలపాలట. కాని భగవత్పాదులిలా వ్యాఖ్యానం చేయటం లేదు. ఇవ అనే శబ్ద మిక్కడ లోపించిందని భావించ మంటాడు. ఇవ అంటే వలె అని అట్టు . పెట్టినట్టే గాని నాసిక మీద చూపుపెట్టమని గాదు వ్యాస హృదయం. రెండు నేత్రాల దృష్టినీ ఒకే ఒక చోట నిలపమని అర్థం. సచ అంతః కరణ సమాధానాపేక్షో వివక్షితః - అలా నిలపాలంటే నీ అంతః కరణ మక్కడే ఉండాలి. అంతఃకరణ మెక్కడ ఉంటే అక్కడే దృష్టి. స్వనాసికాగ్ర సంప్రేక్షణ మేవ చే ద్వివక్షితం - మనస్తత్రైవ సమాధీయేత - నాత్మని. నాసికాగ్రం మీద చూపు నిలపాలనే మహర్షి ఉద్దేశమైతే మనస్సు కూడా అక్కడే ఉంచవలసి వస్తుంది. ఆత్మలో కాదు. ఆత్మని హిమన స్సమాధానం వక్ష్యతి - ఆత్మ సంస్థం మనః కృత్వా ఇతి. కాని ఆత్మ సంస్థం మనః కృత్వా ఆత్మలోనే మనసు నిలపాలి మరెక్కడాగాదని
Page 476